Breaking News

ఎస్.ముప్పవరంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
చాగల్లు మండలం ఎస్.ముప్పవరం గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని గురువారం రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముందుగా దివంగత నాయకులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, మహాత్మా గాంధీ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాలు అట్టడుగున ఉన్న పేద వర్గాలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి సచివాలయ వ్యవస్థను తెచ్చారన్నారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులు ఎంతో పాటు పడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని హోం మంత్రి తానేటి వనిత కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *