రూరల్ పర్యాటక రంగం కోసం దరఖాస్తుల ఆహ్వానం

-తూర్పు గోదావరి జిల్లా ఔత్సాహికులకు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం
-ఆర్ డి – వి. స్వామి నాయుడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పర్యాటక రంగంలో ఉత్తమ పర్యాటక ప్రాంతాల ఎంపికకుగానూ 2024 ఏడాదికి పర్యాటక మంత్రిత్వ శాఖ దరఖాస్తులు ద్వారా ఆహ్వానిస్తూన్నట్లు జిల్లా పర్యాటక ప్రాంతీయ సంచాలకులు వి . స్వామి నాయుడు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈమేరకు తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయ పర్యాటకం, బాధ్యాతాయుత పర్యాటకం, వారసత్వ పర్యాటకం, కళాఖండాలు, శక్తివంతమైన గ్రామాలు, కమ్యూనిటీ ఆధారితం, ఆరోగ్య రంగాలకు సంబంధించిన వారు దరఖాస్తు చేసుకుందుకు అర్హులుగా స్వామి నాయుడు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులను www.rural.tourism.gov.in వెబ్ సైట్లో ఆన్ లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. బెస్ట్ రూరల్ టూరిజం విలేజెస్ గా ఎంపికైన గ్రామాలకు రాష్ట్ర, జాతీయస్థాయిల్లో పురస్కారాలు అందజేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. మరిన్ని వివరాలకు , 63099 42025 , 9121725757 నెంబర్లను సంప్రదించాలని జిల్లా పర్యాటక అధికారి పి. వెంకటాచలం విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *