Breaking News

తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 25 వరకు జిల్లాలో భారీ వర్షాలు తుఫాన్ ప్రభావం ఉంటుందని రాష్ట్ర విపత్తుల శాఖ సూచించిన మేరకు జిల్లా కలెక్టరేట్ కేంద్రంలో 24X7 కంట్రోల్ రూమ్ 0877- 2236007 ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో తుఫాన్ మరియు భారీ వర్షాలు నమోదు కానున్నాయని సంకేతాలు రావడంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని, ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు అందే సమాచారాన్ని విధులు కేటాయించబడిన సిబ్బంది నమోదు చేసుకుని సంబంధిత అధికారులకు, ఉన్నతాధికారులకు తగు చర్యల కోసం సమాచారం అందించాలని ఆదేశించారు. ప్రజలు వాగులు వంకలు దాటరాదని అధికారులు సచివాలయ సిబ్బంది, మండల, ఇతర అధికారులు స్థానికంగానే అందుబాటులో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *