Breaking News

మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఓటు వెయ్యండి

-వోటర్ వెరిఫికేషన్ ప్రకియలో బి.ఎల్.ఓ.కు సహకరించండి
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడే ఓటు వేయమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న తోట వారి వీధి, నందమూరి నగర్, వాంబే కాలనీ లో మంగళవారం ఉదయం క్షేత్రస్థాయిలో ఓటర్ల వెరిఫికేషన్ను స్వయంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తనఖీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గం పొలిటికల్ పార్టిలు మరియు లోవర్ లెవెల్ స్టాఫ్ నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండు మూడు సంవత్సరాలుగా ఆ ప్రాంతాలు కొత్తగా అభివృద్ధి చెందడం వలన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరూ అక్కడ దగ్గరలో ఉన్న పోలింగ్ స్టేషన్లో వాళ్ల పేర్లను మార్చుకోవాల్సిందిగా కోరారు.

వాంబే కాలనీ ఎక్సెల్ ప్లాంట్ వెనుక ఉన్న జేఎన్యుఆర్ఎం(JNURM) అపార్ట్మెంట్స్ లో ఉంటున్న ప్రజలకు, వివిధ పోలింగ్ స్టేషన్లో వాళ్ల ఓట్లను కేటాయించారు అని పొలిటికల్ పార్టీలు కమిషనర్ కు ఫిర్యాదు చేయగా, కమిషనర్ ఫీల్డ్ వెరిఫికేషన్ లో పరిశీలించి అక్కడ వివిధ పోలింగ్ స్టేషన్లో ఉన్న ఓట్లను దగ్గర్లో ఉన్న పోలింగ్ స్టేషన్లోకి మార్చవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరో రెండు రోజులపాటు ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని, 20 సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ పర్యవేక్షిస్తారని కమిషనర్ అన్నారు

బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రజల ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు కేవలం 10 నుంచి 15 నిమిషాలు కేటాయించి బి. ఎల్. ఓ తన ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసేంతవరకు సహకరించవలసిందిగా కోరారు.

డిసెంబర్ 5 లోపు, వోటర్ల పేర్లలో కాని, చిరునామాలో కానీ ఎటువంటి మార్పులు చేయాలన్న, ఉదాహరణకు పేరులో తప్పులను సరి చేయటం, ఫోటోలు మార్పిచ్చటం వంటి ప్రక్రియలు ఏవైనా కావాలన్నా, తమ బి.ఎల్.ఓ ద్వారా కాని, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కానీ, ఎన్.వి.ఎస్.పి పోర్టల్ ద్వారా కానీ, మార్పులు చేసుకోవచ్చు లేదా విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కొచ్చి ఒక ఫోరంను నింపితే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని కమిషనర్ అన్నారు.

ఈ పర్యటనలో కమీషనర్ తో పాటు సిటీ ప్లానర్ జీ.వి.జీ.ఎస్.వి ప్రసాద్, నార్త్ తహసిల్దార్ యం. మాధురి, ఎ.సి.పి జగదీష్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *