Breaking News

మేనిఫెస్టోను యథాతథంగా అమలు చేసిన ఏకైక ప్రభుత్వం

-58వ డివిజన్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే మేనిఫెస్టోను యథాతథంగా అమలు చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ కృష్ణా హోటల్ సెంటర్లోని 252 వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘన నివాళులు అర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సచివాలయం వద్ద లబ్ధిదారులకు అందిన సంక్షేమ జాబితాల బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చేసిన మేలును సగర్వంగా చెప్పుకునేలా సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందున్నవీ, లేనివీ అని అడిగిన ప్రభుత్వం దేశంలోనే మరొకటి లేదని చెప్పుకొచ్చారు. 252 వ వార్డు సచివాలయ పరిధిలోనే గత నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా 10 కోట్ల 33 లక్షల 22 వేల 589 రూపాయల మేలు చేకూర్చగా.. నాన్ డీబీటీ ద్వారా 8 కోట్ల 53 లక్షల 25 వేల 334 రూపాయలు.. మొత్తంగా 18 కోట్ల 86 వేల 47 వేల 923 రూపాయల లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన హామీల అమలుపై ఇంటింటికి వచ్చి ఆరా తీసిన సందర్భం ఒక్కటీ లేదని గుర్తుచేశారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంతకం చేసినప్పటి నుండి అభివృద్ధే ధ్యేయంగా జగనన్న పనిచేస్తున్నారని.. అటువంటి నాయకుడిని మరోసారి నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *