Breaking News

సీఎం వైఎస్ జగన్ పాలనకు మరెవరూ సాటిరారు

-1వ డివిజన్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి, సంక్షేమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే శిఖరాగ్రాన నిలిచిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 1 వ డివిజన్ ఊర్మిళ నగర్లోని 2వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీత సురేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. సచివాలయంలో సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో కూడిన బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్దతు పలుకుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసగించిందని గుర్తుచేశారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అందరీ జీవితాలు బాగుపడ్డాయన్నారు. 2వ వార్డు సచివాలయ పరిధిలో గత నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా 8 కోట్ల 27 లక్షల 907 రూపాయల మేలు చేకూర్చగా.. నాన్ డీబీటీ ద్వారా 2 కోట్ల 68 లక్షల 42 వేల 905 రూపాయలు.. మొత్తంగా 10 కోట్ల 95 లక్షల 43 వేల 812 రూపాయల లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. చంద్రబాబుది మోసకారి ప్రభుత్వమైతే.. సీఎం జగన్ ది సంక్షేమ పాలన అని చెప్పుకొచ్చారు. నీతి, నిజాయితీతో పారదర్శక పాలన సాగిస్తున్న జగనన్నని మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కొండా మహేశ్వరరెడ్డి, ఆళ్ల ప్రసాద్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *