Breaking News

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

-ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తో సమీక్ష సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, బుధవారం సాయంత్రం ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తో విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో తమ చాంబర్ నందు రోడ్డు ప్రమాదాల నివారణకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రద్దీగా ఉన్న పలు ప్రాంతాలను గుర్తించి, ప్రయాణికుల సౌకర్యార్థం ట్రాఫిక్ ని తగ్గించి ప్రమాదాలకు నివారణగా తగు చర్యలకు సుచాలను చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎల్లప్పుడు రోడ్డు ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలైన తీసుకోటానికి సిద్ధంగా ఉంటుందని, ప్రజల శ్రేయస్సు ప్రధానం అని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు, సదుపాయాలు, చర్యలు తీసుకోటానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కమిషనర్ అన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ తో పాటు ఏ.డి.సి.పి (ట్రాఫిక్) ప్రసాద్, ఏసిపి (ట్రాఫిక్) వెంకటనారాయణ, ఏసీపీ (సౌత్) రవి కిరణ్, ఏసీపి (సెంట్రల్) భాస్కర్, కృష్ణలంక సీఐ ఎంవీ దుర్గారావు, డిప్యూటీ సిటీ ప్లానెర్ జూబిన్ సిరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పర్క్స్) ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *