-విభిన్న ప్రతిభావంతులకు అండగా జగనన్న ప్రభుత్వం…
-జగనన్న పాలనలో సామాజిక భద్రతలో భాగంగా విభిన్న ప్రతిభ వంతులకు పెన్షన్లు పెంచే కార్యక్రమం..
-70 మంది విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లు, హియరింగ్ మిషన్స్,ట్రై సైకిళ్ళు,వీల్ చైర్స్ అందజేత.
-జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్ మిగతా సర్వీస్ ఆర్గనైజేషన్స్ సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు..
-ఉద్యోగ నియామకాలు మరియు పదోన్నతుల్లో రిజర్వేషన్లు పట్ల ప్రత్యేక శ్రద్ధ…
-విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా,జక్కంపూడి విజయలక్ష్మి,వి.సీ కె.పద్మరాజు..
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభవంతులను అన్ని విధాలుగా ఆదుకోవడంలో ప్రభుత్వ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తూర్పుగోదావరి రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు.
ఆదివారం నాడు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా రాజానగరం మండలం చక్రద్వార బంధం గ్రామంలో ప్రతిభావంతులకు ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సహాయ సంస్థ, జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్,రోటరీ రివర్ సిటీ, రాజమహేంద్రవరం, నన్నయ విశ్వ విద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగం,తదితరుల సంస్థల ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభా వంతులకు హియరింగ్ మిషన్స్,వీల్ చైర్స్,మోటార్ సైకిల్స్,ట్రై సైకిల్స్ మొదలగున్నవి అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులకు అనేక కార్యక్రమా లు చేపడుతూ వారికి మంచి జరగాలని ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగానే వారికి పెన్షన్ పిలిచే కార్యక్రమం వారికి అండగా అనేక చట్టాలు తీసుకు రావడం జరిగిందన్నారు.
నేడు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఒక పక్క ప్రభుత్వ భాగస్వామ్యంతో మరో పక్క వివిధ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో నియోజకవర్గంలోని గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా వచ్చిన వినతు లను ఆధారంగా చేసుకొని నియోజక వర్గంలో 10 మందికి మోటార్ సైకిళ్ళు,6 వీల్ చైర్స్,18 ట్రై సైకిల్స్, 35 మందికి హియరింగ్ మిషన్స్ అందచేయడం జరిగిందన్నారు.
రానున్న రోజుల్లో జక్కంపూడి రామ్మోహన్రావు ఫౌండేషన్ మరియు వివిధ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి వారికి మరింత అండగా ఉంటామన్నారు.
ఈ సందర్భంగా నన్నయ్య యూనివర్సిటీ విసి కె.పద్మరాజు మాట్లాడుతూ నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగా నేడు జక్కంపూడి రాజా అభ్యర్థన మేరకు ఈ విన్న ప్రతిభావంతుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన డం జరిగిందని మా తరుపున 20 మందికి హియరింగ్ మిషన్స్ అందచేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ దివంగత నేత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు వు గారి పేరిట జక్కంపూడి రామ్మోహన్రావు ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆపదలో ఉన్న వారికి బాసటగా నిలుస్తున్నామన్నారు.
ఇంతటి మంచి కార్యక్రమాన్ని మన రాజానగరం నియోజక వర్గంలో నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
విభిన్న ప్రతిభవంతులలో అపార నైపుణ్యాలు ఉన్నాయని ధైర్యంగా ముందుకు సాగాలని సమాజం మరింత చేయూత అందిస్తే వారి మరింతగా రాణించగలుగుతారు అన్నారు.
మా జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్ తరపున ఎవరికి ఏటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో వాసంశెట్టి పెద్ద వెంకన్న,దూలం పెద్ద, తుమ్మిడి రామ్ కుమార్,కోలపాటి వెంకన్న,డాక్టర్ బాబు,నక్క రాంబాబు,కర్రీ నాగేశ్వర రావు, కడియాల పాపారావు,కుంచ భాస్కర్ రావు,నీరుకొండ శ్రీనివాస రావు, శివరామకృష్ణ, ఏ.పీ.ఏ.ఎస్. ఎల్. పి డాక్టర్ త్రివిక్రమ్,సెక్రెటరీ గురుమూర్తి, గోపి వెంకటేష్, జక్కంపూడి రామ్మోహన్ ఫౌండేషన్ ట్రష్టి పట్నాయక్,వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News