నగరంలో రాధే గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూం ప్రారంభం


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో స్వచ్ఛతలో నాణ్యతలో మన్నికైనదనే నమ్మకాన్ని ఇచ్చే రాధే గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూం ప్రారంభించబడిరది. శుక్రవారం జైహింద్‌ కాంప్లెక్స్‌లో రాధే గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూమ్‌ను నిర్వాహకులు హర్షవర్ధన్‌, విద్యాధర్‌, సంజయ్‌, నరసింహారావులు ముఖ్య అతిధి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ కొనకళ్ళ విద్యాధరరావులు ముఖ్య అతిధులుగా విచ్చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాల ఈ రంగంలో అనుభవం కలిగిన నలుగురు స్నేహితులు రాధే గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ నూతన షోరూంను నగరంలో ప్రజలకు చేరవుగా జైహింద్‌ కాంప్లెక్స్‌లో ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. ఆధునాతన సరికొత్త మోడల్స్‌లో బంగారు ఆభరణాలను అతి తక్కువ ధరలలో అందిస్తున్నారని చెప్పారు. మగువల మనసు దోచుకునే విధంగా చక్కని నగిషీతో రూపొందించబడిన వజ్రాభరణాలు అందుబాటులో తీసుకువచ్చారన్నారు. రాబోయే కాలంలో నాణ్యమైన బంగారు వజ్ర ఆభరణాలకు మారుపేరుగా రాధు గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ నిలవనుందన్నారు. ఈ నూతన షోరూం దినదినాభివృద్ధి చెంది అన్ని నగరాల్లో విస్తరించాలని ఆకాంక్షించారు. అనంతరం రాధే గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ అధినేతలు మాట్లాడుతూ తమ వద్ద నాణ్యమైన 100 శాతం ప్యూర్‌, ఒరిజనల్‌ గోల్డ్‌తో తయారు చేసిన ఆభరణలతోపాటు డైమండ్‌ జ్యూయలరీ కూడా అందుబాటు వుందని ఆధునాతనమైన వివిధ రకాలైన మోడల్స్‌లో అందుబాటు ధరలో తమ వద్ద లభ్యమవుతాయన్నారు. ఇంత చక్కటి మేలిమి బంగారు ఆభరణాల షోరూంను ప్రతి ఒక్కరూ సందర్శించి ఖచ్చితమైన నాణ్యమైన బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *