-దేశ ప్రజలందరికీ ఆదర్శనీయులు అంబేద్కర్
-జీవిత విశేషాల ఛాయా చిత్ర ప్రదర్శన
-రెండు రోజుల పాటు చిత్ర ప్రదర్శన నిర్వహించనున్నాం
-జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ దేశ ప్రజలు అందరికీ ఆదర్శనీయుడని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లో సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్రపై సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను జిల్లా కలెక్టర్ డా.కే. మాధవీలత జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహులు, ఇతర జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భాల కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, అంబేద్కర్ జననం, బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, రాజ్యాంగ రచన, వివిధ ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శన ఎంతో ఆసక్తిని కలిగించిందన్నారు. యువతకు, ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల విగ్రహం, అంబేద్కర్ సేవలకు ప్రతిరూపంగా నిర్మించిన స్మృతి వనాన్ని ప్రారంభించనున్నా రన్నారు. జిల్లాలో ఇప్పటికే జనవరి 9 నుండి నుంచి 12 తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయం, మండలం, జిల్లా స్థాయిల్లో జన్ భగీదర్ కార్యక్రమం కింద అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించడం, జరిగిందన్నారు. పాఠశాల విద్యార్థులకు అంబేద్కర్ జీవిత విశేషాలపై అవగాహన పెంపొందిస్తూ వివిధ పోటీలు ఇతర కార్యక్రమాలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ప్రతి గ్రామ సచివాలయ స్థాయిలోని అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేసి ఘనంగా నివాళులర్పించడం, ఆయన జీవిత విశేషాలపై చర్చించడం జరిగిందన్నారు.
అదే నేపథ్యంలో అంబేద్కర్ జీవిత ఘట్టాలకు సంబంధించిన ఛాయా చిత్ర ప్రదర్శనను కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు.
జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ భారత దేశంలో ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ ప్రజలంతా ఐకమత్యంతో ఉండడం రాజ్యాంగ ద్వారానే సాధ్యమని తెలిపారు. పేదరికంలో జన్మించినప్పటికీ అన్ని పరిస్థితులను అధిగమిస్తూ .. చదువుతూనే ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని నింపారన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి మార్గ నిర్దేశకులుగా చరిత్రలో నిలిచిపోయారని ఆయన జీవితాశయాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
తొలుత జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, జిల్లా అధికారులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై ఏర్పాటుచేసిన ఛాయా చిత్ర ప్రదర్శను పెద్ద ఎత్తున వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు తిలకించి ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాత్సవ్, డిఆర్ఓ జి. నరసింహులు ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, కేఆర్ సీ డిప్యూటీ నాయక్, డియంహెచ్ఓ డా.కె. వేంకటేశ్వర రావు, డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి, సీపీఓ ఎల్. అప్పల కొండ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎం సందీప్, డి ఐ పి ఆర్ ఓ సి ఎస్ శ్రీనివాస్, డి పి ఆర్ ఓ ఐ కాసయ్య,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె. విజయ కుమారి,డి ఈఓ ఎస్. అబ్రహం, డి ఎల్ డిఓ పి. వీణాదేవి, సివిల్ సప్లై జిల్లామేనేజరు వి.నాగార్జున రెడ్డి, ఎస్ ఈ పి ఆర్ ఎ బి వి ప్రసాద్, ఎస్ ఈ ఆర్ డబ్ల్యు ఎస్ డి. బాల శంకరరావు, డి ఎల్ డివో వి. శాంతమణి పలువురు జిల్లా శాఖా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News