గణతంత్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి.

-ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించేలా శకటాలు ఏర్పాటు చేయాలి.
-జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 26న నిర్వహించబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె . మాధవీ లత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో స్థానిక ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించు జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, అడిషనల్ ఎస్పీ ఎల్. చెంచిరెడ్డి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాత్సవ్, డిఆర్ఓ జి. నరసింహులు తో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె . మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ అవసరమైన ఏర్పాట్లను చేయాలన్నారు. జిల్లా నూతనంగా ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను, ఒకసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని అదే తరహాలో అధికారులు వారికి కేటాయించిన విధులను సమన్వయంతో నిర్వహిస్తూ విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

ఆర్ట్స్ కళాశాల లో నిర్వహించే పోలీస్ పెరేడ్ ను సిద్ధం చేయడంతో పాటు పోలీస్ బ్యాండ్, జెండా ఆవిష్కరణ వేదిక, బందోబస్తు, తదితర అంశాలకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లా విద్యా శాఖ అధికారి కనీసం ఐదు సాంస్కృతిక కార్యక్రమాలకు తక్కువ కాకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వ్యవసాయ, హార్టికల్చర్, మత్స్య, మార్కెటింగ్, డ్వామా, పిఆర్, డిపిఓ, హౌసింగ్, టిడ్కో, రూడా, విద్య, డిఆర్డిఏ, మెప్మా, ఆర్డబ్ల్యూఎస్, ఐసిడిఎస్, హెల్త్ తదితర శాఖలు సమన్వయంతో ప్రభుత్వ పథకాలు ప్రతిభంబించేలా శకటాలు ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళిక రూపొందించి సిద్ధం చేయాలన్నారు.

మెరిటోరియస్ సర్టిఫికెట్ల కోసం ఈనెల 20వ తేదీ లోపు ఆయా శాఖలకు సంబంధించి పేర్లను పంపించాలని జిల్లా రెవెన్యూ అధికారికి పంపించాలని, అవార్డు గ్రహీతలు సాధించిన పనితనం గురించి సంక్షిప్తంగా తెలియ జేయాలన్నారు.

ఆర్ట్స్ కళాశాల మైదానం , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు సమయంలో ఆర్ట్స్ కళాశాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని పోలీసు అధికారులు సూచించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, అడిషనల్ ఎస్పీ ఎల్. చెంచి రెడ్డి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాత్సవ్, డిఆర్ఓ జి. నరసింహులు ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, కేఆర్ సీ డిప్యూటీ నాయక్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *