-నామినేషన్లు స్వీకరించే తుది రోజు వరకూ ఓటరు నమోదు చేస్తాం
-ఇవిఎం, కంట్రోల్ యూనిట్స్ , వివి ప్యాట్స్ పై అవగాహన కల్పిస్తున్నాo
-కలెక్టర్ డా.మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటరు జాబితా ఫైనల్ పబ్లికేషను జనవరి 22న విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టరు డాక్టర్ కె మాధవీలత తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ చాంబరులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత మాట్లాడుతూ జనవరి 22వ తేదీన ఓటరు జాబితా ఫైనల్ పబ్లికేషను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. నిరంతరం నామినేషన్లు చివరి తేది వరకు ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా చేరుటకు అవకాశం ఉంటుందని తెలియ చేశారు. కొత్తగా నమోదు చేసిన వారి పేర్లను సప్లిమెంటరీ జాబితా ద్వారా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఓటరు జాబితాలో పేరు, అడ్రసు మార్పు, ఒకేడోరు నెంబరు తదితర సవరణలు చేసి సరిదిద్దడం జరిగిందని తెలిపారు. ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో ప్రతి విషయాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల దృష్ణికి తీసుకురావడం జరిగిందన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్లపై ప్రజలకు అవగాహన కల్పించుటకు జిల్లాలోని జన సమూహం గల ప్రదేశాలలో శాశ్వత సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా ఎన్నికల కార్యాలయం మరియు రిటర్నింగ్ అధికారి ప్రధాన కార్యాలయం / రెవెన్యూ సబ్-డివిజన్ అధికారుల వద్ద శాశ్వత సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఇవిఎం పై అవగాహన కోసం ఆయా కేంద్రాలను సందర్శించేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టరు తెలిపారు.
అక్టోబర్ 27 నాటికి ఎస్ ఎస్ ఆర్ 2024 డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో 763694 పురుషులు, 796552 మహిళలు, 108 దర్డ్ జెండర్ వెరసి 1560354 ఓటర్ల ఉండగా, ఇప్పటి వరకు 1.1.2024 నాటికి తుది ఓటరు జాబితా మేరకు 785142 పురుషులు, 820515 మహిళలు, 105 మంది థర్డ్ జెండర్ వెరసి 16,05,762 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయడం తో పాటు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవగాహన కలిగించడంలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలని కోరారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జే.నరసింహులు, ఆర్డీవో ఏ చైత్ర వర్షిని, రాజకీయ పార్టీలు ప్రతినిధులు కాంగ్రెస్ ఎన్.రమేష్ శ్యామ్, సిపిఎం ఎస్ ఎస్ మూర్తి లు , వైయస్ఆర్ సీపీ కే. రాజశేఖర్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News