-మొత్తం 31,336 స్వయం సహాయక సంఘాలు
-జిల్లాలో 3,07,510 మంది పొదుపు సంఘ సభ్యులు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో 31,336 స్వయం సహాయక సంఘాలలో 3,07,510 మంది పొదుపు సంఘం అక్క చెల్లెమ్మలను రుణ విముక్తులను చేసేందుకు వైఎస్సార్ ఆసరా ద్వారా వరుసగా నాల్గవ విడత రూ. 295.02 కోట్ల నగదు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జమ చేయడంతో పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హలో జరిగిన జిల్లా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి ఎస్ వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తొలుత ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండ బహిరంగ సభ నుంచి వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగో విడత నిధులు నేరుగా స్వయం సహాయక పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 6,394.83 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనున్న జమ చేసే కార్యక్రమంను వీక్షించారు
అనంతరం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి లతో కలిసి లబ్ధిదారులకు వైఎస్సార్ ఆసరా నాల్గవ విడత రూ. 295.02 కోట్ల నగదు మెగా చెక్కును అందచేశారు
వైఎస్సార్ ఆసరా ద్వారా వరుసగా నాల్గవ విడత నగదు జమ కావడంతో కొందరు మహిళల అభిప్రాయాలు
1. బొబ్బిలి లక్ష్మి దేవి,మంగినపూడి,
మచిలీపట్నం.
డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ అప్పట్లో పొదుపు సంఘాల మహిళలకు ఆయన ఇచ్చిన హామీని ఇప్పుడు సంపూర్ణంగా జగనన్న అమలుచేయడం ఎంతో సంతోషం కలిగిస్తుందని బొబ్బిలి లక్ష్మీదేవి అన్నారు. తమ గ్రూప్ పేరు వాణి స్వయం సహాయక బృందం అని, చెప్పిన మాటను ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ఖచ్చితంగా అమలుచేశారని ఈ విషయమై తమ గ్రూప్ సభ్యులు సంబరపడుతున్నారని తమను ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ఈ సహాయం ఎంతో గొప్పదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
2. కొడాలి రూపలత, ఇనగుదురుపేట,
మచిలీపట్నం
తమ గ్రూప్ పేరు ఉదయ అని చెబుతూ, జగన్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చిన రుణమాఫీ సమయానికి తమ సబ్యులకు 2 లక్షల అప్పు ఉందని ఆ మొత్తాన్ని నాలుగు విడతల్లో జమ చేయడంతో గోల్డ్ కవరింగ్ పనులు చేసుకొనే తమబోటి చేతి వృత్తులు చేసుకునేవారికి ముఖ్యమంత్రి జగనన్నకు ఎంతో రుణపడి ఉంటామని రూపలత కృతజ్ఞతలు తెలియచేసారు.
3 పూషదం బాల, జవ్వారుపేట,
మచిలీపట్నం.
తమ స్వయం సహాయక సంఘం పేరు శ్రీ లక్ష్మి దేవసేన గ్రూప్ అని టైలరింగ్ , పచ్చళ్ళు, అప్పడాలు, తినుబండారాలు తయారుచేయడం వాటిని దుకాణాలలో విక్రయిస్తామని తమ గ్రూప్ తరుపున గతంలో లక్షా 75 వేల రూపాయలు తీసుకున్నామని, ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత క్రింద .. ఆ మొత్తం ఇప్పుడు రుణమాఫీ కావడం ఎంతో సంతోషంగా ఉందని బాల తెలిపారు.
Prajavartha Online Telugu News