Breaking News

అనపర్తి నియోజక వర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలన

-తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి
-స్ధానిక పోలింగ్ కేంద్రం వద్ద బీఏల్వో పేరు ఫోన్ నెంబర్ తప్పని సరి
-స్కూల్ విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి
-జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ మాధవీలత

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే ఈ వి ఎమ్ అనుబంధ యూనిట్స్ , పొలింగ్ మెటీరియల్ భద్ర పరిచి , సామాగ్రి పంపిణి కి సమగ్ర కార్యాచరణకు  అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని  కలెక్టర్ ,  జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత స్పష్టం చేశారు

గురువారం ఉదయం స్థానిక శ్రీ రామారెడ్డి జెడ్పీపి బాలుర ఉన్నత పాఠశాలలో అనపర్తి నియోజక వర్గం కోసం ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని , స్ట్రాంగ్ రూమ్ ను రిటర్నింగ్ అధికారి ఎమ్. మాధురీ , ఇతర అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సంధర్భంగా జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ , ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించే క్రమంలో ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాల లో భాగంగా అనపర్తి నియోజక వర్గం పరిధిలోని స్ధానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలనీ పరిశీలించినట్లు తెలిపారు. ఈ కేంద్రం నుంచి నియోజక వర్గంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవిఎమ్ పరికరాలు, ఇతర పోలింగ్ మెటీరియల్ పంపడం జరుగుతుందనీ అన్నారు . ఇందుకోసం అనువైన భవనాన్ని ఎంపిక చేయటం, అదే ఆవరణలో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కూడ ఏర్పాటు చేస్థున్నట్లు తెలియ చేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రాల వారీగా సెక్టర్ల ను ఏర్పాటు చేసి, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకి వాటినీ అప్పగించడం జరుగుతుందనీ అన్నారు. ఇందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ ప్రకారం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

పోలింగ్ కేంద్రం పరిశీలన :
అనపర్తి నియోజక వర్గ పరిధిలో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ మాధవీలత పరిశీలించారు. పోలింగ్ కేంద్రం వివరాలూ, బి ఎల్ వో పేరు, ఫోన్ నెంబర్ పోలింగ్ కేంద్రం రూమ్ వద్ద, అదేవిధంగా స్కూల్ ఆవరణ లోనికి ప్రవేశించే గోడమీద ఆ కేంద్రం లోని మొత్తం పి ఏస్ వారీగా బీఎల్ వో వివరాలు, ఫోన్ నెంబర్ లను ఓటర్ల కోసం అందుబాటులో ఉండేలా ప్రదర్శించాలని ఆదేశించారు.

స్కూల్ విద్యార్థులతో ముఖాముఖి :
స్కూల్ ఆవరణలో ఉన్న తరగతి గదిని కలెక్టర్ మాధవీలత సందర్శించి, విద్యార్థిని లతో ముఖాముఖి సంభాషించారు. చదువు విషయంలో బెరుకు లేకుండా చదవాలని అప్పుడే భాషపై పట్టు సాధించడం సాధ్యం అవుతుంది అన్నారు. దామిని నీ చూసి స్ఫూర్తి పొందాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనీ, ఆమేరకు విద్యార్థులు కూడా ఇష్టం తో చదవాలని, ఆమేరకు ఉపాధ్యాయులు కూడా ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు.

కలెక్టర్ వెంట అనపర్తి ఆర్ వో ఎమ్. మాధురీ, సహయ ఈ ఆర్ వో లు అనపర్తి బి. నాగరాజు నాయక్, బిక్కవోలు డి. సునీల్ బాబు, రంగంపేట లతీఫ్ బాషా, పెదపూడి ఇంఛార్జి డి టి రామచంద్రా రెడ్డి , కళాశాల అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *