అన్న‌దాత‌కు ఆస‌రాగా విప్ల‌వాత్మ‌క ప‌థ‌కాలు

-వైఎస్ఆర్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్ కింద అయిదో ఏడాది మూడో విడ‌త‌లో 1,42,011 మంది రైతుల‌కు రూ. 28.73 కోట్ల ల‌బ్ధి
-30,405 మంది రైతుల‌కు రూ. 7.72 కోట్ల సున్నా వ‌డ్డీ రాయితీ
-ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్ర‌భుత్వం అన్న‌దాత‌కు ఆస‌రాగా నిలిచేందుకు విప్ల‌వాత్మ‌క ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తోంద‌ని.. వీటిని స‌ద్వినియోగం చేసుకొని ఉన్న‌తంగా ఎద‌గాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సూచించారు. వ‌రుస‌గా అయిదో ఏడాది మూడో విడ‌త‌గా వైఎస్ఆర్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్ సాయంతో పాటు పంట రుణాల‌కు సంబంధించి సున్నా వ‌డ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో నేరుగా జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాన్ని గౌర‌వ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌రేట్ వీసీ హాల్ నుంచి క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. విజ‌య‌వాడ న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్లు అవుతు శ్రీశైల‌జారెడ్డి, బెల్లం దుర్గ‌, రాష్ట్ర కాపు కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ అడ‌పా శేష‌గిరి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ఎస్‌కే ఆసిఫ్‌, జైన్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ మ‌నోజ్ కొఠారి, ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ బండి శివ‌శ‌క్తి పుణ్య‌శీల‌, జిల్లా వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ డి.దామోద‌ర్‌రెడ్డి, జిల్లా గ్రంథాల‌య సంస్థ ఛైర్‌ప‌ర్స‌న్ టి.జ‌మ‌ల పూర్ణ‌మ్మ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బ‌ట‌న్ నొక్కి ల‌బ్ధి మొత్తాల‌ను రైతుల ఖాతాల్లో జ‌మ‌చేసిన అనంత‌రం క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. ప్ర‌జాప్ర‌తినిధులు, వివిధ కార్పొరేష‌న్ల ఛైర్మ‌న్లు, అధికారుల‌తో క‌లిసి జిల్లాకు చెందిన రైతుల‌కు ఆర్థిక స‌హాయానికి సంబంధించిన మెగా చెక్‌లు అంద‌జేశారు.
ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్ కింద అయిదో ఏడాది మూడో విడ‌త‌లో 1,42,011 మంది రైతుల‌కు రూ. 28.73 కోట్ల ల‌బ్ధి చేకూరిన‌ట్లు తెలిపారు. అదే విధంగా 30,405 మంది రైతుల‌కు రూ. 7.72 కోట్ల సున్నా వ‌డ్డీ రాయితీ అందుతున్న‌ట్లు వెల్లడించారు. ర‌బీ (2021-22), ఖ‌రీఫ్ (2022)లో పంట రుణాలు తీసుకొని స‌కాలంలో చెల్లించిన రైతుల‌కు వ‌డ్డీ రాయితీని నేరుగా రైతుల ఖాతాల్లో జ‌మ‌చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. వైఎస్ఆర్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్ ద్వారా 2019-20 నుంచి 2023-24 (రెండు విడ‌త‌లు) వ‌ర‌కు 1,41,726 రైతు కుటుంబాల‌కు దాదాపు రూ. 815 కోట్ల మేర ల‌బ్ధి చేకూరింద‌ని వెల్ల‌డించారు. సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతుల‌తో పాటు ఎస్‌సీ,ఎస్‌టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ రైతుల‌కు కూడా వైఎస్ఆర్ రైతు భ‌రోసా కింద సాయం అందుతోంద‌న్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహ‌కాలు, సహాయాలను సద్వినియోగం చేసుకుని మంచి దిగుబ‌డులు సాధించి మెరుగైన ఆదాయాలు పొందాల‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు సూచించారు.
కార్య‌క్ర‌మంలో జిల్లా వ్య‌వ‌సాయ, ఉద్యాన అధికారులు ఎస్‌.నాగ‌మ‌ణెమ్మ‌, పి.బాలాజీ కుమార్, డీఏఏబీ స‌భ్యులు, వివిధ ప్రాంతాల రైతులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *