Breaking News

తెలుగు క‌వ‌యిత్రి ఆతుకూరి మొల్ల‌మాంబ (మొల్ల‌)కి ఘ‌న నివాళులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం కలెక్టరేట్ లో తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మొల్ల చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా జిల్లా కలక్టర్ డా కే. మాధవీలత నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 వ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి నీ నిర్వహించుకోవడం జరిగిందనీ పేర్కొన్నారు. తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణం శైలి చాలా సరళమైనదిగా, , రమణీయమైనదిగా పేర్కొన్నారు. మొల్ల రామాయణం ఆరు కాండాలలో 871 పద్యాలతో కూడిన ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *