జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎపిపీ ఎస్సి గ్రూప్ 1 పరీక్షలు

-జిల్లాలో 25 కేంద్రాలలో పరీక్షల నిర్వహణా దరఖాస్తు చేసుకున్న 8, 258 మంది అభ్యర్థులు
-పేపర్ 1 కి హాజరైనా 5,056 (61.23 %)  మంది అభ్యర్థులు
– పేపర్ 2 కి హాజరైనా 5,007 (60.63 %)  మంది అభ్యర్థులు
-జేసీ తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 25 పరీక్షా కేంద్రాలలో ఏ పి పి ఏస్ సి గ్రూప్ 1  పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్ , నోడల్ అధికారి  ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు.

ఆదివారం ఉదయం ఐఎస్ టి ఎస్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ , ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నందు పరీక్షా కేంద్రాలని  జెసి తనిఖీలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు , ఆర్డీవో రాజమండ్రీ ఎ. చైత్ర వర్షిణి లు నగరంలోని పలు పరీక్షా కేంద్రాలని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జాయింట్  కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ వివరాలు తెలియ చేస్తూ,  జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలలో గ్రూప్ 1 ఎపిపి ఎస్సి పరీక్షలను ఉదయం , మధ్యహ్నం రెండూ సెషన్స్ లో నిర్వహించటం జరిగిందన్నారు. 8,258 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకోగా పేపర్ 1 కి ఉదయం 5,056  (61.23 %)  మంది అభ్యర్థులు హాజరు కాగా 3202 మంది గైహాజరయ్యారు. పేపర్ 2 కి 5,007  (60.63 %)  మంది హాజరు కాగా 3 251 మంది గైహాజరయ్యారు అని తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *