Breaking News

ఈనెల 26 నుండి 28 వరకు వైభవంగా ఇస్సపాలెం అమ్మవారి తిరునాళ్ల..

నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి సమీపంలో ఉన్న ఇస్సపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి తిరునాళ్ల 49 వ మహోత్సవాలు ఈనెల 26 నుండి 28 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా దేవాలయము నందు ప్రతిరోజు విగ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్యరాధన, అఖండ దీపారాధన, కుంకుమార్చన, ధ్వజారోహణ, నీరాజన మంత్రపుష్పార్చన , దీక్షాధారణ తదితర కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే మొదటి రోజున నరసరావుపేట పట్టణంలో మహిళల కోలాట ప్రదర్శనతో అమ్మవారి ఊరేగింపు, రెండవ రోజున అమ్మవారికి పొంగళ్ళు సమర్పణ, ఇస్సపాలెంలో అమ్మవారు ఊరేగింపు, 3 వ రోజున పూర్ణాహుతి, భారీ అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయి. మూడవ రోజున విద్యుత్ ప్రభలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కాబట్టి ఈ కార్యక్రమాలలో భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని దేవస్థానం చైర్మన్ కొత్త సాంబశివరావు(విఎస్పి), ఈవో టి. సుధాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు కోరుతున్నారు.  ఈ మూడు రోజులు పూజా కార్యక్రమాలు ప్రధాన అర్చకులు యనమంద్ర సత్య సీతారామచంద్ర,, కొత్తలంక కార్తికేయ శర్మ పర్యవేక్షణలో జరుగుతాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *