ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ

చంద్రగిరి, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
18 సం. లు నిండిన ప్రతి యువత ఓటరుగా తప్పక నమోదు చేసుకొని లోక్ సభ మరియు శాసన సభ ఎన్నికలు 2024 నందు పోలింగ్ రోజున మే 13 న తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ అన్నారు.

గురువారం సాయంత్రం 166-చంద్రగిరి శాసనసభ నియోజక వర్గంలోని చంద్రగిరి పట్టణంలోని ప్రత్యంగిరా అమ్మవారి ఆలయం నుండి చంద్రగిరి కోట వరకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ నందు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత చంద్రగిరి ఈఆర్ఓ నిషాంత్ రెడ్డి నియోజక వర్గ తాసిల్డార్లు, ఎంపిడిఓ లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, బిఎల్వో లు, పంచాయితీ సెక్రటరీలు తదితర అధికారులు, ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ర్యాలీ నందు పాల్గొని ఎన్నికల పర్వం… దేశ గర్వం అని, ఐ ఓట్ ఫర్ ష్యూర్, ఓటు హక్కును వినియోగించుకుందాం… ప్రజా స్వామ్యాన్ని గెలిపిద్దాం అని పలు నినాదాలు చేస్తూ, అందరితో పలికిస్తూ ఉత్తేజపరిచారు. 18 సం. లు నిండిన ప్రతి యువత ఓటరుగా తప్పక నమోదు చేసుకావాలని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ మే 13 న జరిగే ఎన్నికల పోలింగ్ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆర్ఓ లు, బిఎల్వో, సెక్టరల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, అలాగే సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ఓటర్లను వారి ఓటు హక్కును వినియోగించుకునేల చైతన్య పరచాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ 612 ఏర్పాటు చేసి క్యాంపస్ అంబాసడర్ లను ఏర్పాటు చేసి యువతను మోటివెట్ చేసి అర్హత కల వారిని ఓటరుగా నమోదు చేయించి వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్య పరుస్తున్నామని తెలిపారు. ఎన్నికల పండుగలో మే13 న ప్రతి ఒక ఓటరు పాల్గొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు. తిరుపతి కొత్త జిల్లాలో మొట్ట మొదటి సారిగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు 2024 అని ఇందులో ఓటర్ టర్న్ ఔట్ పెంచేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ ఎన్నికల్లో 75 శాతం పైన పోలింగ్ లక్ష్యంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని నిష్పాక్షపాతంగా ఎన్నికలు నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చంద్రగిరి కోటలో ఏర్పాటు చేసిన ఫోటో బూత్ ను కలెక్టర్ ప్రారంభించి ఫోటో దిగారు. అలాగే చంద్రగిరి కోటను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తాసిల్దార్లూ, ఎంపిడిఓ లు, బిఎల్వో లు, రెవెన్యూ, పంచాయితీ కార్యదర్శులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *