ప‌క‌డ్బందీగా ఈవీఎం ర్యాండ‌మైజేష‌న్‌

– రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో విజ‌య‌వంతంగా నిర్వ‌హ‌ణ‌
– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాస్త్రీయంగా ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో తొలి విడ‌త ఈవీఎం ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ‌ను గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో నిర్వ‌హించిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. జిల్లా క‌లెక్ట‌రేట్ ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రంలో శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు నిర్వ‌హించిన తొలి విడ‌త ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ‌కు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్ త‌దిత‌రుల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. తొలుత క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో భాగ‌మైన ఈవీఎం ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ గురించి రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌కు వివ‌రించారు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో 234 పోలింగ్ స్టేష‌న్లు, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో 253, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో 257 పోలింగ్ స్టేష‌న్ల‌తో పాటు 10 ఆగ్జ‌ల‌రీ పోలింగ్ స్టేష‌న్లు, మైల‌వ‌రంలో 295 పోలింగ్ స్టేష‌న్ల‌తో పాటు ఒక ఆగ్జ‌ల‌రీ పోలింగ్ స్టేష‌న్‌, నందిగామ‌లో 222, జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో 222 పోలింగ్ స్టేష‌న్లు మొత్తం 1,792 పోలింగ్ స్టేష‌న్లు ఉన్నాయ‌ని వివ‌రించారు. అదే విధంగా విజయవాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గానికి 2,151 కంట్రోల్ యూనిట్లు, 2,151 బ్యాలెట్ యూనిట్లు, 2,330 వీవీప్యాట్‌లు అవ‌స‌ర‌మ‌ని.. ఇదే స్థాయిలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఈవీఎంల అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా అద‌న‌పు యూనిట్లను కూడా అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఈవీఎం మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ ద్వారా ఆన్‌లైన్లో ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసిన అనంత‌రం ఈ డేటా ఆధారంగా గొల్ల‌పూడిలోని ఈవీఎం గోదాము వ‌ద్ద ఈవీఎంల‌ను నియోజ‌కవ‌ర్గాల‌కు అందించే ప్ర‌క్రియ‌ను రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో నిర్వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ ర్యాండ‌మైజేష‌న్ డేటా ఆధారంగా పార్ల‌మెంట‌రీ, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్ల‌తో పాటు వీవీప్యాట్‌ల‌ను అందించే ప్ర‌క్రియ స‌జావుగా సాగుతోంద‌ని తెలిపారు. ఎక్క‌డా ఎలాంటి గంద‌ర‌గోళానికి తావులేకుండా, ఒక నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లాల్సిన ఈవీఎం వేరే నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లింద‌నే దానికి ఆస్కారం లేకుండా రిట‌ర్నింగ్ అధికారులు, స‌హాయ సిబ్బంది స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రిస్తూ ప‌నిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కోడ్ స్కానింగ్‌, యూనిట్ల‌ను బాక్సులో ఉంచ‌డం త‌దిత‌ర ప‌నుల‌న్నీక్ర‌మ‌ప‌ద్ధ‌తిలో జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. మామూలుగా అయితే ఈ ప్ర‌క్రియ జ‌ర‌గ‌డానికి నాలుగైదు రోజుల ప‌డుతుంద‌ని.. అయితే ప‌క‌డ్బందీ స‌న్న‌ద్ధ‌త కార‌ణంగా ఒక‌టిన్న‌ర రోజుల్లోనే పూర్తవుతుంద‌ని వివ‌రించారు. ఇక్క‌డి నుంచి అత్యంత భ‌ద్ర‌త మ‌ధ్య త‌ర‌లించే ఈవీఎంల‌ను ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఆర్‌వోల ప‌రిధిలోని స్ట్రాంగ్ రూమ్‌ల‌లో భ‌ద్ర‌ప‌ర‌చ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇందులో భాగ‌స్వాములైన ప్ర‌తి ఒక్క‌రికీ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. అదే విధంగా ఈ ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాముల‌వుతున్న రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుకుల ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో పీవోలు, ఏపీవోల శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, విజ‌య‌వాడ ఆర్‌డీవో, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఆర్‌వో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, కేఆర్‌సీ స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్, విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఆర్‌వో కిర‌ణ్మ‌యి, నందిగామ ఆర్‌డీవో కె.మాధ‌వి, తిరువూరు ఆర్‌డీవో ఎ.ర‌వీంద్ర‌రావు, జ‌గ్గ‌య్య‌పేట ఆర్‌వో జి.వెంక‌టేశ్వ‌ర్లు, ఈవీఎం నోడ‌ల్ అధికారి జి.మ‌హేశ్వ‌ర‌రావు, ఎన్నిక‌ల సెల్ సూప‌రింటెండెంట్ ఎం.దుర్గాప్ర‌సాద్ త‌దిత‌రుల‌తో పాటు వై.రామ‌య్య (టీడీపీ), ఎల్‌.శివ‌రామ ప్ర‌సాద్ (వైఎస్ఆర్‌సీపీ), పీవీ శ్రీహ‌రి (బీజేపీ), డీవీ కృష్ణ (సీపీఐ-ఎం), షేక్ అబ్దుల్ స‌త్తార్ (వైఎస్ఆర్ సీపీ) త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. మొత్తం ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *