చంద్రబాబునాయుడు ఎస్సీల పట్ల నిర్లక్ష్యంతో హేళన చేసిన వ్యాఖ్యలకు తక్షణం వెంటనే క్షమాపణ చెప్పాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వీరాంజనేయులను ఉద్దేశించి చంద్రబాబునాయుడు, టిప్పర్‌ డ్రైవర్‌గాళ్లు ఎడమ చేతి వేలిముద్రగాళ్లు అంటూ హేళన చేసిన వ్యాఖ్యలకు తక్షణం ఉపసంహరించుకుని, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సాక్షిగా క్షమాపణ చెప్పాలని కావూరి జయకుమార్‌ స్థానిక గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కావూరి జయకుమార్‌ మాట్లాడుతూ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎస్సీ సామాజిక వర్గంకు చెందిన వీరాంజనేయులు ముఖ్యమంత్రి జగనన్న ఆశీస్సులతో మే 13న జరుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. ఈ వీరాంజనేయులు కుటుంబ పోషణ కోసం టిప్పర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఎం.ఏ ఎకనామిక్స్‌తో పాటు బీ.ఈడీ పూర్తి చేసిన గొప్ప చదవరి, నిరుపేద అటువంటి వ్యక్తికి జగనన్న సీటు ఇచ్చారని, అన్నారు. నారా చంద్రబాబు నాయుడు తక్షణమే ఎస్సీలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేదంటే జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం ఆగ్రహానికి గురిగాక తప్పదని హెచ్చరిస్తున్నానని అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ వయస్సును ప్రామాణికంగా ఓటు హక్కు కల్పించారని, చట్టసభలలో ప్రవేశం కల్పించారు. అదే ఉద్దేశంతో మరో అంబేద్కర్‌ మన ముఖ్యమంత్రి జగనన్న, అదే బాటలో మరో అంబేద్కర్‌ మన ముఖ్యమంత్రి జగనన్న పేదలు రోజువారి కూలీలు, నిరక్షరాస్యులు, విద్యావంతులు, మేధావులను అందర్నీ కలుపుకొని కులాలుకు అతీతంగా, ఆర్థిక స్తోమతలకు భిన్నంగా, ఆలోచిస్తూ ఎన్నికలలో టిక్కెట్లు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజవరపు వెంకటేష్‌ బాబు, ఏళ్లపూడి లాజర్‌, గుంతక రమేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *