‘‘సాయి కనకదుర్గ జవేరి’’ మార్కెట్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని స్థానిక గవర్నర్‌పేటనందు స్వర్ణ వ్యాపార దుకాణాలకు అతి చేరువలో జైహింద్‌ కాంప్లెక్స్‌ మరియు బాలాజీ జ్యువెల్‌ వరల్డ్‌ అతి చేరువలో ప్రత్యేకంగా స్వర్ణ వ్యాపారులకై నిర్మించబడుతున్న ‘‘సాయి కనకదుర్గ జవేరి మార్కెట్‌’’ శుక్రవారం ప్రారంభించబడిరది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆత్మకూరు వెంకట జగన్‌మోహన్‌రావు, ఆత్మకూరు వెంకట బాల సురేష్‌లు మాట్లాడుతూ నేడు వ్యాపారానికి కావలసింది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, వినియోగదారులను ఆకర్షించే చక్కని వేదిక, సరైన ప్రణాళిక, వసతులు, సౌకర్యాలు షాపింగ్‌ అనుభూతి వీటినన్నిటిని కస్టమర్లకి అందించగలిగితే సామాన్య వ్యాపారవేత్తలు కూడా తమ వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం వుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక శాతం బంగారు ఆభరణాలు అమ్మకంలో జరిగే విజయవాడలోని ఇది స్వర్ణ వ్యాపారులకు స్వర్ణ అవకాశమని అన్నారు. విజయవాడ చుట్టుపక్కల గ్రామాల నుండి అత్యధికంగా బట్టలు, బంగారం వివాహాది శుభకార్యాలకు కొనుగోలు చేస్తున్నారని, అందువల్ల వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధికి ఈ మార్కెట్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గతంలో బంగారం కొనుగోలుకు విజయవాడ వన్‌టౌన్‌ ప్రసిద్ధిగా వుండేదని, ఇప్పుడు టౌన్‌ మొత్తంలో ముఖ్యంగా గవర్నర్‌పేట కేంద్రంగా ఉన్నదని నిర్వాహకులు తెలిపారు. నగరం నడిబొడ్డులో ‘‘సాయి కనకదుర్గ జవేరి’’ మార్కెట్‌ ప్రారంభించామని అన్నారు. ఈ కాంప్లెక్స్‌లో 30 దుకాణాల వున్నాయని, స్వర్ణ వ్యాపారులకు మాత్రమే స్వర్ణ అవకాశంగా మేము అందరికీ ‘‘సాయి కనకదుర్గ జవేరి’’ మార్కెట్‌ అందుబాటు తీసుకొచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్‌ నిర్వాహకులు, వివిధ కంపెనీల అధినేతలు, స్వర్ణకారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *