Breaking News

రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ ఈ వి ఎమ్ ల తరలింపు ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

-అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకు తరలింపు ఆర్వో తేజ్ భరత్

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రీ రూరల్ నియోజక వర్గం , నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్  (NAC) హాస్టల్ భవనం, కలెక్టరేట్‌, ధవళేశ్వరం నందు ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తొలి విడత ఈ వి ఎమ్ లు చేరుకున్నాయని రాజమండ్రి రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలియ చేశారు. శుక్రవారం రాత్రి రాజమండ్రీ రూరల్ నియోజక వర్గం పరిధిలో ఉన్న 267 పొలింగ్ కేంద్రాల కు సంబంధించిన బ్యాలెట్ యూనిట్స్ కలక్టరేట్ ఆవరణలో ఉన్న తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ చేరుకునే ప్రక్రియని జాయింట్ కలెక్టర్ స్వయంగా పర్యవేక్షణ చెయ్యడం జరిగింది.

ఈ సందర్భంగా రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ వివరాలు తెలియ చేస్తూ, కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈవీఎమ్ లని తరలింపు ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. నియోజక వర్గ పరిధిలో ఉన్న 267 పొలింగ్ కేంద్రాల కు సంబంధించిన 320 చొప్పున బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్స్ లు రిజర్వ్ యూనిట్స్ కేటాయించడం జరిగిందన్నారు. వాటినీ అత్యంత భధ్రత మధ్య డీ సి ఎం ఎస్ వాహనం ద్వారా రూరల్ స్ట్రాంగ్ రూమ్ కి తీసుకుని రావడం జరిగిందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన బ్యాలెట్ యూనిట్స్ ,కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్స్ లను భద్ర పరుచుటకు అన్నీ ఏర్పాట్లు చేశామన్నారు. ఈరోజు పార్లమెంటు కి చెందిన యూనిట్స్ నియోజకవర్గానికి కేటాయించిన సాయుధ ఎస్కార్ట్ బృందం ఆధ్వర్యంలో వచ్చాయని తెలిపారు.

స్ధానిక జిల్లా స్థాయి స్ట్రాంగ్ రూమ్ వద్ద మున్సిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఆర్డీవో చైత్ర వర్షిణి, పార్లమెంటు సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్. కృష్ణ నాయక్, ట్రైనీ ఎస్ డి సి ఎం. భవానీ ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. సహాయ రిటర్నింగ్ అధికారులు, డిప్యూటి తహసీల్దార్లు, ఇతర అనుబంధ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *