Breaking News

ఎన్నికల్లో నీతిమంతులనే ఎన్నుకోవాలి… : గాంధీ నాగరాజన్‌


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల్లో నీతిమంతులనే ఎన్నుకోవాలని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ (నేటి గాంధీ) ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నుంచి ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ కారులో బయలుదేరి పలు ముఖ్యకూడళ్లలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఓటర్ల అవగాహన ప్రచారం ప్రారంభంలో భాగంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎవరు ముందుకు వస్తారో వారికే ఓటయ్యాలని పిలుపునిచ్చారు. స్వార్ధం కోసం అలివికాని హామీలు ఇచ్చే వారికి ఓటేయ్యద్దు అంటూ నగరంలో ప్రధాన కూడళ్లలో గాంధీ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మద్యపానం నిషేధం విధించాలని తాను ఎన్నికల కమిషనర్ కి వినతులు ఇచ్చినా అది అమలు చేయలేదన్నారు. వారి వారి స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజలకు ఎలాంటి ఆపేక్ష లేకుండా సేవలు అందించేందుకు కృషి చేసేవారినే ఎన్నుకోవాలని గాంధీనాగరాజన్ ఓటర్లను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ ఎపి అధ్యక్షురాలు బంగారు భారతి, ట్రస్ట్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *