పోలింగ్ విధులు నిర్వహించి ఎన్నికల ప్రక్రియ విజయవంతం చేయాలి…

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికలలో నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా పోలింగ్ విధులు నిర్వహించి ఎన్నికల ప్రక్రియ విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిఓలు, ఏపీవోలకు సూచించారు. 71- గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు బుధవారం ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పిఓలకు, ఏపీవోలకు పోలింగ్ నిర్వహణలో ముఖ్యాంశాలు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాగా చదివిన విద్యార్థులు మాత్రమే పరీక్షల్లో పాస్ అవుతారు, అదేవిధంగా ఎన్నికలు కూడా పరీక్షల వంటివే, కావున ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్ బుక్ క్షుణ్ణంగా చదవి అర్థం చేసుకోవాలని, తద్వారా నిబంధనల పట్ల అవగాహన కలిగి పొరపాట్లకు ఆస్కారం లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు.

రిసెప్షన్ సెంటర్కు సకాలంలో చేరుకోవాలని, ఆలస్యంగా వస్తే రిజర్వులో పెడతారనే అపోహలు వీడాలన్నారు., అనవసర కారణాలతో విధుల నుండి మినహాయింపులు కోరవద్దని సూచిస్తూ, సహెతుకమైన కారణం ఉంటే మినహాయింపు ఇస్తామన్నారు. పొరపాటు జరిగినప్పుడు అనవసర అయాందోళనలకు గురికాకుండా నిజాయితీగా రిపోర్ట్ చేయాలని సూచించారు. ప్రిసైడింగ్ అధికారిగా ఏఏ రిపోర్టులు, ఎప్పుడెప్పుడు, ఏ ఏ ఫారాల్లో ఇవ్వాలి అనే విషయాలు ముందుగా అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఫారంలో కాలమ్స్ చదువుకుని సరైన సమాచారంతో నింపాలని సకాలంలో ఖచ్చితమైన రిపోర్టులు పంపాలన్నారు. బ్యాలెట్ యూనిట్-వివి ప్యాట్-కంట్రోల్ యూనిట్ లను కనెక్ట్ చేయడంలో సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్, గన్నవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మ, బాపులపాడు తాసిల్దార్ ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *