Breaking News

రాష్ట్ర మంత్రి ఆర్.కె.రోజా సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో తమ కుటుంబాలతో చేరిన భవన కార్మికులు

నగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా సమక్షంలో పుత్తూరు రూరల్ మండలం కృష్ణ సముద్రం గ్రామానికి చెందిన మేస్త్రి ఎస్ సురేష్ ఆధ్వర్యంలో నగరి మున్సిపాలిటీ పరిధి లోని కాకవేడు, చింతలపట్టెడ మరియు పుత్తూరు రూరల్ మండలం లోని క్రిష్ణసముద్రం గ్రామాలకు చెందిన భవన కార్మికులు ఎస్ సురేష్, డి గోపాల్, వెన్నెల, అముద, యశోద, మాల, నరసింహులు, సింధు, మునికృష్ణ, రేఖ, జగదీష్, నాగరాజ్, దేవాని, వెంకటేష్, మారియమ్మ, శేఖర్ తదితరులు 18 కుటుంబాలు టిడిపి నుంచి వైస్సార్సీపీ లో గురువారం చేరారు. రాష్ట్ర మంత్రి ఆర్.కె.రోజా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పరిపాలన మరియు నగరి నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి మంత్రి రోజా నాయకత్వంలో పనిచేయుటకు వైసీపీలో చేరినట్లు వారు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *