విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఏపీ సీఆర్డ్ఏ, అమరావతి స్మార్ట్ సిటీ పనులను సంస్థ కమిషనర్ వివేక్ యాదవ్ ఐఏఎస్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ముఖ్యంగా అమరావతిలో ట్రంక్ రోడ్ల వెంబడి మరియు నిర్మాణంలో ఉన్న భవన సముదాయాల ప్రాంతాల్లో పెరిగిన మూళ్ళ కంపలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఇందుకు 76 జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేస్తున్న పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం రాయపూడిలో నిర్మాణంలో ఉన్న అమరావతి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను పరిశీలించి ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేసారు. తదుపరి ఉద్దండరాయునిపాలెంలో అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి నిరంతరాయంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఇక్కడ సెక్యూరిటీ గార్డులతో రక్షణ కల్పించాలని ఆదేశించారు.
Tags vijayawada
Check Also
స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం
-రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …
Prajavartha Online Telugu News