రాజమహేంద్రవరం, ఆర్డీవో కార్యాలయ ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఎనిమిది అర్జీలు స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వొచ్చే అర్జీలను త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారిణి ఎ. చైత్ర వర్షిణి అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎ. చైత్ర వర్షిణి ప్రజల నుంచి వచ్చిన ఎనిమిది అర్జీలను స్వీకరించారు. ఈరోజు పింఛను, ఇళ్ల స్థలం, భూ సర్వే, కిడ్నీ వ్యాధి గ్రస్తునికి పింఛను కోరుట తదితర అంశాలకు సంబంధిచి ఎనిమిది మంది నుంచి అర్జీలను స్వీకరించా మన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి దరఖాస్తు తాత్సారం చేయకుండా త్వరిత గతిన పరిష్కరిస్తామన్నారు.

అర్జీలు ….

రాజమండ్రి నగరానికి చెందిన కే. భానుప్రియ అని మహిళా తాను ప్లాట్ ఫారం మీద షాపు పెట్టుకొని జీవిస్తున్నానని, ప్రస్తుతం ఆ షాపును మున్సిపాలిటీ వారు కొట్టివేస్తున్నందున తనకు జీవనోపాధి కల్పించవలసిందిగా కోరుట.

సిమెంట్రీ పేట రాజమహేంద్రవరం కు చెందిన ఏ వినయ్ అనే యువకుడు తనకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నందున పింఛను మంజూరు చేయవలసిందిగా కోరుట.

రాజమహేంద్రవరం, కోరుకొండ గ్రామానికి చెందిన ఎం కామేశ్వరరావు రెవెన్యూ రికార్డుల్లో ల్యాండ్ ఫారం 22a ప్రోబిటేడ్ లిస్ట్ నందు తొలగించవలసిందిగా కోరుట.

రాజమహేంద్రవరం వివర్స్ కాలనీ చెందిన కంచర్ల అన్నపూర్ణ తాను ప్రభుత్వం వారి స్థలములో పాక నిర్మించుకొని ఉంటున్నానని, ప్రస్తుతం అది పడవేసినందున వేరే ఒక స్థలం ఇప్పించవలసిందిగా కోరుట.

రాజమండ్రి కి చెందిన ఏ శేఖర్ అనే వ్యక్తి తాను కిడ్నీ వ్యాధితో బాధపడుతునాన్నని ప్రభుత్వ వారు కిడ్నీ బాధితులకు మంజూరు చేయు పింఛను ఇప్పించవలసిందిగా కోరుట.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *