ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పన

-ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపనిచేస్తుంది
-ఆసుపత్రికి వెళ్ళితే దేవాలయానికి వెళ్లిన అనుభూతిని  ప్రజల్లో ఉండే విధంగా అభివృద్ధి చేస్తాం
-రు. 13. 85 కోట్లతో నిర్మించనున్న ఏరియా ఆసుపత్రి వంద పడకల అదనపు భవనానికి భూమి పూజ శంకుస్థాపన
మంత్రి
-రాష్ట్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యాశాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ద్వారంపూడి బుల్లెమ్మ ఏరియా ఆసుపత్రి ఆవరణలో మంత్రి సత్య కుమార్ యాదవ్ స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,పార్లమెంట్ సభ్యులు పురందేశ్వరి, స్థానిక నాయకులు అధికారులతో కలిసి రు. 13.85 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఏరియా ఆసుపత్రి వంద పడకల అదనపు భవనానికి భూమి పూజ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని.. ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం ఇందు కొరకు రు. 13.85 కోట్ల రూపాయలతో వంద పడకల అదనపు భవనాన్ని నిర్మించే దిశగా భూమి పూజ శంకుస్థాపన చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆపదలో ఉన్న ప్రాణాలు నిలిపి వారికి పునర్జన్మ నిచ్చేది ఆసుపత్రి మాత్రమేనని, ఆసుపత్రికి వెళ్ళితే దేవాలయానికి వెళ్లిన అనుభూతిని ప్రజల్లో ఉండే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. దేశ ప్రధాని మోదీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం గా ఆసుపత్రులకు నామకరణం కూడా చేయడం జరిగిందన్నారు.

గతంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో 7 మంది వైద్యులు మాత్రమే ఉంటే, నేడు ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేసిన తరువాత 22 మంది వైద్యులు వైద్య సిబ్బంది, ఇతర సిబ్బందితో కలిసి మొత్తం 96 మంది విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏరియా ఆసుపత్రి ద్వారా అనేకరకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 45 వేల జనాభా గల అనపర్తి లో సామాజిక ఆసుపత్రి సరిపోతుందని అయితే ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి తాను శాసనసభ్యులుగా చేసిన గత కాలంలోనే ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అయితే పరిపాలన విధానం గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని మంత్రి అన్నారు.
గత ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఆసుపత్రిలో అభివృద్ధికి విచ్చించలేదన్నారు . పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు భరోసా కల్పించే ఆరోగ్య శ్రీ పథకం లో కూడా రు. 2 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, ఇలా బకాయి ఉంటే ఏ కార్పొరేట్ ఆసుపత్రి పేదల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు వస్తుందని ఆయన విమర్శించారు.

రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురందేశ్వరి మాట్లాడుతూ ప్రజారోగ్య సంరక్షణ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయని, ఆ దిశగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.

స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి ఏరియా ఆసుపత్రిని రు. 13.85 కోట్ల రూపాయలు తో వంద పడకల ఆసుపత్రి అదనపు భవనాల అభివృద్ధిని ఆరోగ్యశాఖ మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో మా తండ్రి మూలారెడ్డి హయాంలో పీహెచ్సీగా ఉన్న ఆస్పత్రి ని 30 పడకల చేయడం జరిగిందని తెలిపారు. 2014-19 కాలంలో రు.5 కోట్లు నాబార్డ్ నిధులతో ఆసుపత్రి అదనపు భవనాలు నిర్మించుకున్నామన్నారు. నీలం తుఫాన్ వలన ఆసుపత్రి చుట్టూ నీటితో మునగడం వలన మరో కోటి రూపాయలు తో అభివృద్ధి చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అనపర్తి సామర్లకోట కాకినాడ 5.7 కోట్లు, రామవరం రాయవరం రోడ్డు అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరయ్యాయని, త్వరలో ఆర్ అండ్ బి అధికారులు పనులు చేపట్టనున్నారు. నియోజకవర్గంలో కాకినాడ సాగర్ కెనాల్ తూడు తొలగింపు పనులు చేపట్టామన్నారు. గోదావరి కెనాల్ అభివృద్ధికి రు. 20 కోట్లు మంజూరయ్యాయన్నారు. ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత ఇసుక పాలసీని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రు. 3 వేల రూపాయల నుండి రు. 4 వేల రూపాయలు వరకు  పెంచి బకాయిలతో  జూలై మాసంలో పెన్షన్ లబ్ధిదారుకు 7వేల రూపాయలు అందించారని శాసనసభ్యులు నల్లమిల్లి  రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
ఏరియా ఆసుపత్రి 100 పడకల  అదనపు భవన నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్య కుమార్ యాదవ్ కు కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

రామవరం ప్రభుత్వ హోమియో వైద్యశాలను పరిశీలించిన మంత్రి సత్య కుమార్..

మంత్రి సత్య కుమార్ యాదవ్ రామవరం ప్రభుత్వ హోమియో వైద్యశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ కు వివరిస్తూ గత కొంతకాలంగా ప్రభుత్వ హోమియో వైద్యశాల మూత పడిందని తిరిగి దానిని పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఈ వైద్యశాల ఎంతో ఉపయుప్తంగా ఉంటుందని చెప్పారు. హోమియో వైద్యశాలకు నూతన భవనాన్ని ఏర్పాటు చేసే వరకు స్థానికంగా ఉన్న ఆయుష్ ఆసుపత్రిలో  హోమియో వైద్య శాల ద్వారా ప్రజలకు వైద్య సేవలను అందిస్తామని మంత్రికి విన్నవించారు.

ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురందేశ్వరి, శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రీజనల్ డైరెక్టర్ పి పద్మ శశిధర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డా. కే వెంకటేశ్వరరావు, డా. నరసింహనాయక్, డిసిహెచ్ఎస్ డా.ఎన్ పద్మశ్రీ రాణి, సూపరింటెంట్ డాక్టర్ రామ గురు రెడ్డి, మాజీమంత్రి టిడిపి రాష్ట్ర కార్యదర్శి జవహర్ రెడ్డి, స్థానిక నాయకులు అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *