-లాలాచెరువు ఉన్నత పాఠశాల లో స్టూడెంట్ కిట్స్ పంపిణీ
-విద్యార్థుల ప్రగతికి,భవితకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి విద్యార్థి పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై బాగా చదువుకోవాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. స్థానిక 50 వ వార్డు లో లాలా చెరువు ఉన్నత పాఠశాల లో అర్బన్ విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టూడెంట్ కిట్స్” పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా శాసనసభ్యుల ఆది రెడ్డి వాసు మాట్లాడుతూ.. విద్య తోనే మనం భవిష్యత్తు లక్ష్యాలను సాధించుకోగలమని, తద్వారా సమాజంలో ఉన్నతమైన స్థానంలో నిలిచేందుకు విద్య ఎంతో తోడ్పాటు నిస్తుందన్నారు.
చదువు అభివృద్ధికి సూచిక మని సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్లిన వారి అభిప్రాయాలను భావాలను అర్థం చేసుకొని వ్యక్తిగత ఎదుగుదలకు చదువు ఎంతో తోడ్పాటునిస్తుందన్నారు. గత ప్రభుత్వం లో చదువుతున్న విద్యార్థి ఇంటికి ఒక్కరికే అమ్మ ఒడి సొమ్ము ఇచ్చేవారని,నేడు కూటమి ప్రభుత్వం అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా ఇంట్లో చదువుతున్న పిల్లలు అందరికీ తల్లుల ఖాతాలో సొమ్ము జమచేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు బ్యాగ్, షూ,నోట్ బుక్స్,యూనిఫామ్ లన్నీ కలిపి న కిట్ లను అందచేశారు.
తదుపరి..
“ఏక్ పేడ్.. మా కే నామ్”
అమ్మ పేరు తో అమ్మతో కలిసి మొక్కను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి..పాఠశాల ఆవరణ లో మామిడి మొక్క నాటారు.ప్రతి ఒక్కరూ వీలున్నన్ని మొక్కలు నాటి,పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు.
తొలుత అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ బి దిలీప్ కుమార్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు స్వాగతం పలికి, స్టూడెంట్ కిట్స్ కార్యక్రమ వివరాలు తెలియచేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ ని మెమెంటో తో ఘనం గా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎస్ సుభాషిణి, టి డి పి రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్, 50 వార్డ్ ఇన్ ఛార్జి మరియు, టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి యాదవ్, హరి, చింతపల్లి నాని, బి సి సెల్ అధ్యక్షులు ఆనంద్ చిన్ని, అర్బన్ ఎమ్ ఈ ఓ -2 రమా రజని,పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ.మల్లేశ్వర రావు,అర్బన్ పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, వార్డు పెద్దలు వనచర్ల సుజాత,వండారి లక్ష్మీ, కాసిబోయిన రాజు,జి.సత్యనారాయణ, ఆకుల విజయ భారతి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News