బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చల్లపల్లి తహసీల్దార్ బీ.సుమతి శనివారం ఒక ప్రకటనలో కోరారు. చల్లపల్లి రైతు బజారులో ఏర్పాటు చేసిన కేంద్రంలో 113 మంది 1,245 కేజీలు రా రైస్, 34 మంది 385 కేజీల స్టీమ్ రైస్, 173 మంది 146 కిలోల కందిపప్పు కొనుగోలు చేసినట్లు తెలిపారు. గ్రామంలోని రిలయన్స్ స్మార్ట్ బజారులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా 24 మంది 50 కిలోల రా రైస్, 46 మంది 74కిలోల స్టీమ్ రైస్, 72 మంది 84 కేజీల కందిపప్పు కొనుగోలు చేసినట్లు వివరించారు. ఈ కేంద్రాల్లో బీపీటీ, స్వర్ణ మసూరి రా రైస్ కేజీ రూ.48, స్టీమ్ రైస్ కేజీ రూ.49, దేశవాళి కందిపప్పు కేజీ రూ.160లకు అందిస్తున్నట్లు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *