Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి

-తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకు క్షేత్ర స్థాయిలో సూచనలు అందించాలి.
-రాష్ట్రంలో పంట నష్టం అంచనా వేయండి.
-రైతు సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయండి. – –
-రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ కి సూచించారు. శనివారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు  రాజశేఖర్ తో ఫోన్ లో మాట్లాడి పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా పంట నష్టం అంచనా వేయాలని సూచనలు చేశారు. జిల్లాల వారీగా వర్షపాతం ఎప్పటికప్పుడు నమోదు చేసి అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

-ప్రజలు అత్యవసర సమాచారం కోసం 08672-252399 నంబర్‌కు ఫోన్ చేయాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *