Breaking News

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. మంత్రి శనివారం ఉదయం తమ నివాసంలో కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, సృజనలకు ఫోన్ చేసి ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలకు నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎగువ నుండి వస్తున్న వరదను, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారులకు తగు ఆదేశాలు జారి చేయాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ పనులు ముమ్మరం కానున్న తరుణంలో మాన్సూన్ వల్ల రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతున్నాయని, వర్షాలు పడడం శుభ పరిణామం, కానీ గత ప్రభుత్వంలో ఇరిగేషన్ కాలువలు డ్రైన్స్ సరైన నిర్వహణ లేక ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేశారని అన్నారు. శానిటేషన్ మెరుగుపరచాలని వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున నదీ పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *