ఆవ ఇళ్ల పట్టాల స్థలాలు పరిశీలన

-కలెక్టర్ ప్రశాంతి

మధురపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆవా భూములలో గృహ లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణి పై ప్రజా ప్రతినిధులు తెలియ చేసిన అంశాల నేపధ్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కోరుకొండ మండలం కాపవరం , బురుగుపూడి గ్రామాల్లో అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పంపిణీ పథకంలో భాగంగా ఆవ ప్రాంతంలోని కాపవరం, బూరుగు పూడి గ్రామాల్లోని 361 ఎకరాల్లోని భూములను ఇళ్ల స్థలాల కోసం అర్జీ పెట్టుకున్న లబ్దిదారులకు పట్టాలని జారీ చెయ్యడం జరిగిందన్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో నూతనంగా ఎన్నికైన గౌరవ ప్రజా ప్రతినిధుల సమక్షంలో అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఆ సమావేశంలో భాగంగా పలువురు ప్రజా ప్రతినిధులు ఆవ భూములలో ఇళ్ల పట్టాల పంపిణి చెయ్యడం జరిగిందన్నారు. అక్కడ ఇళ్ల నిర్మాణాలకు అనుకూలత లేదని కలెక్టర్ దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఆ ప్రాంతం ముంపుకు గురి అయ్యే అవకాశం ఉందని, కలెక్టర్ ను పరిశీలన చెయ్యాలని కోరడం జరిగిందన్నారు. ఆ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆవ భూములు, ఇండ్ల స్థలాలు ముంపుకు గురి కాకుండా చూసేందుకు పరిశీలన చేసి, సమగ్ర సమాచారం సేకరించడం జరిగిందని, ఆమేరకు అధికారులు నివేదిక అందచేయాలని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం ముంపుకు గురికాకుండా చూసేందుకు ఇరిగేషన్ శాఖ పరంగా చేపట్టవలసిన చర్యలు పై క్షేత్ర స్థాయిలో సమీక్షించినట్లు తెలియచేసారు. రూట్ మ్యాప్ ను అధికారులు వివరించినట్లు తెలిపారు.

కలెక్టర్ వెంట ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, ఇరిగేషన్ డి ఈ – కే. ఆనంద బాబు, కోరుకొండ తహశీల్దార్ సుమలత తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *