వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం కాకాని తరుణ్ చేస్తున్న కృషి అభినందనీయం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫర్నీచర్‌ అందించడంతోపాటు కన్స్యూమర్ కోర్ట్ బిల్డింగ్ బాగుచేతకు మూడు లక్షల నిధుల మంజూరు కోసం నిరంతరం కృషి చేసినందుకు గానూ వినియోగదారుల అవగాహన ఫౌండేషన్‌ అధ్యక్షుడు, ఎన్టీఆర్‌ జిల్లా వినియోగదారుల పరిరక్షణ మండలి సభ్యులు డాక్టర్‌ తరుణ్‌ కాకానిని ‌ ఏపీ రాష్ట్ర వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ అధ్యక్షులు దొమ్మేటి శ్రీనివాస్‌, ఎన్టీఆర్ జిల్లా వినియోగదారుల కమీషన్ అధ్యక్షులు నేలపూడి చిరంజీవి, సభ్యులు A రమణ సత్కరించారు. శ‌నివారం విజయవాడ వినియోగదారుల కమీషన్ లో నూతన రికార్డ్ రూం ప్రారంభం సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు చేకూరి శ్రీపతి , నరహరిశెట్టి మరియు సీనియర్ న్యాయవాదుల పాల్గొన్నారు. వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం కాకాని తరుణ్ చేస్తున్న కృషి అభినందనీయం అని కొనియాడారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *