Breaking News

ట్రాక్టర్, ద్విచక్ర వాహనాలపై వరద బారిన పడిన లంకగ్రామాలలో పర్యటించిన కలెక్టర్ నాగరాణి

నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతికి ముంపుకు గురైన లంక గ్రామాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఆచంట మండలం అయోధ్య లంక, మర్రిమూల గ్రామానికి పడవపై చేరుకున్న పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. నీట మునిగిన లంక గ్రామాలకు ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ మీద ప్రయాణిస్తూ లంక గ్రామ వాసులకు భరోసానందించారు. ఎస్సీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో కలయ తిరుగుతూ ప్రతి కుటుంబం యొక్క యోగక్షేమాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆరా తీశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *