స్వచ్చత హి సేవా కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం స్వచ్చత హి సేవా కార్యక్రమం జిల్లా స్థాయి కార్యక్రమం రాజమహేంద్రవరంలో, విశ్వ కర్మ జయంతి వేడుకలు కలెక్టరేట్ నందు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. స్వచ్ఛత హి సేవా తొలి రోజు కార్యక్రమం జిల్లా స్థాయిలో, మండల, గ్రామ స్థాయి లో మానవ హారం, శుభ్రత పై మెగా డ్రైవ్ ను ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఆధ్వర్యంలో ప్రజలతో సామూహిక పరిశుభ్రత డ్రైవ్‌లు, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఆరోగ్య సంరక్షణ, సేవలు అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి కార్యక్రమం వై జంక్షన్ వద్ద ఉదయం 9.30 గంటలకు నిర్వహించి సంతకాలు సేకరణ, గొడప్రతి ఆవిష్కరణ చే యనున్నట్లు తెలిపారు. విశ్వ కర్మ జయంతి వేడుకలను బొమ్మూరు స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు జిల్లా పర్యటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *