జిల్లా పంచాయితీరాజ్ జిల్లా పరిపాలనాధికారి డా॥ నందిక మహాలక్ష్మి కుమార్ కు నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పంచాయితీరాజ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డా॥ నందిక మహాలక్ష్మి కుమార్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ ను హర్యానా గవర్నర్ చేతుల మీదుగా సెప్టెంబరు 19 న గురువారం హైదరాబాద్ లోని గవర్నర్ క్యాంపు కార్యాలయంలో అందుకున్నారు. హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ అవార్డ్ ను ఆయన అందుకున్నారు. గవర్నర్ క్యాంప్ కార్యాలయం, హైదరాబాద్ లో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. విద్యాధికుడు, నిత్యాభ్యాసి అయిన డా॥ మహాలక్ష్మీ కుమార్ దాదాపు 50 డిగ్రీలు చేసి ఎందరికో స్ఫూర్తి గా నిలిచినట్లు గవర్నర్ అభినందించినట్లు మహాలక్ష్మి కుమార్ తెలిపారు. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు గౌరవ సలహాదారునిగా ఉంటూ, ప్రభుత్వ ఉద్యోగులకు కండాక్ట్ & సర్వీస్ రూల్స్ పై శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందజేస్తున్ననని, అనేక మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చిన్నట్లు తెలిపారు.

“వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్” సంస్థ ద్వారా ఉచితం గా కౌన్సిలింగ్, సైకోథెరపి మొదలైన సేవల ద్వారా ఎంతో మందికి చేయూతనిస్తున్నారు. అవార్డు పొందిన సందర్భంగా జిల్లా పంచాయితీరాజ్ ఇంజినీరింగ్ అధికారి శ్రీ మహమ్మద్ అలిముల్లా, సిబ్బంది, ఇతర జిల్లా అధికారులు, యస్.ఆర్.ప్రింటర్స్ నాగులపల్లి సురేష్కుమార్, సామాజికవేత్త వనుం శ్రీనివాస్, అత్తిలి రాజు తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *