మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం 11 గంటలకు మచిలీపట్టణం చేరుకున్నారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో మచిలీపట్టణం ఏ .జె. కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కి రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి , ఎమ్మెల్సీ కంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యే లు వెనిగళ్ళ రాము, కాగిత కృష్ణ ప్రసాద్ , వర్ల కుమార్ రాజు, మండలి బుద్ధ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ డి. కె. బాలాజీ ,జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు ,, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్, ప్రభృతులు పుష్పగుచ్ఛాలు, మొక్కలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.
