Breaking News

మహిషాసురమర్ధని అలంకృత జగజ్జననిని దర్శించుకున్న శాసనసభ్యులు హరిప్రసాద్

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
దుర్గా శరన్నవరాత్రులు తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని దేవి (మహర్నవమి) అలంకృత అమ్మవారిని శాసనమండలి సభ్యులు హరిప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. క్యూ లైన్లలో కూడా గందరగోళం తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *