ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యం వద్దు…

-అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తాం…
-16 బస్సులు సీజ్ చేసాం… డీటీసీ ఎ మోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని కాంటాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీలను నిర్వహించామని అధికదరలు వసూలుచేస్తున్న బస్సులపై కేసులు నమోదుచేసామని డీటీసీ ఎ మోహన్ తెలిపారు. స్థానిక బందరు రోడ్డు లోని డీటీసీ కార్యాలయం నుండి ఆదివారంనాడు పత్రిక ప్రకటనను విడుదల చేసారు ఈ సందర్భంగా డీటీసీ మోహన్ మాట్లాడుతూ పండుగలకు దూరపు ప్రాంతాల నుండి సొంత ఊర్లకు వస్తున్న ప్రయాణికుల నుండి కొన్ని ప్రవేటు ట్రావెల్స్ బస్సులు అధిక చార్జీలను వసూలు చేస్తున్నారని అటువంటి వాహనాలను గుర్తించి ఆయా బస్సులపై కేసులు నమోదు చెయ్యడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని మోటారు వాహన తనిఖీ అధికారులతో ఆరు బృందాలుగా ఏర్పారచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించమన్నారు. ఈ నెల 3వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు/ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో బస్సులలో సరైన రికార్డులు లేకపోవడం పన్నులు చెల్లించకపోవడం ప్రయాణికుల నుండి అధిక ధరలు వసూలు చెయ్యడం ప్రయాణికుల వివరములు లేకపోవడం గమనించమని అన్నారు. అటువంటి 151 బస్సులపై కేసులు నమోదుచేసామన్నారు. ప్రత్యేక తనిఖీల ద్వారా 28,24,645/-రూపాయిలు అపరాధ రుసుము విధించామని ఆయన తెలిపారు. దీనిలో 16 బస్సులపై కేసులు నమోదు చెయ్యడమే కాకుండా బస్సులను సీజ్ కూడా చేశామని మోహన్ తెలిపారు. ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించడం అధిక ధరలు వసూలు చేయడం మానుకోవాలని ప్రవేటు ట్రావెల్స్ యజమానులను డీటీసీ చూసించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని మోహన్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *