-ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య
కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
పరిటాల గ్రామం నందు గతంలో మహమ్మద్ జామియా మసీదు శిథిలావస్థకు చేరుకొనడంతో మైనారిటీ సోదర సోదరీమణులు స్థానికులు గ్రామస్తులు తిరిగి పునర్నిర్మాణం గావించి నూతనముగా ఏర్పాటు చేసుకున్న మహమ్మద్ జామియా మసీదును ముస్లిం మత పెద్దలు మైనారిటీ సోదర సోదరీమణులు మరియు కూటమినేతలతో కలసి నూతన మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ మహమ్మద్ జామియా మసీదు ఎంతో ప్రాముఖ్యత కలిగిన మసీద్ అని అందరూ సమిష్టిగా తిరిగి నూతన మసీదును ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషదాయకముని తెలియజేస్తూ మసీదు ఆవరణలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని మత పెద్దల ఆశీర్వచనం పొంది అనంతరం భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
Prajavartha Online Telugu News