Breaking News

దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం

-తెనాలిలో ఒక కోటి 25 లక్షల రూపాయలతో Mgnregs నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
దీపావళి సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ లా పథకాన్ని ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పల్లె వారోత్సవాలు భాగంగా ఆదివారం తెనాలి నియోజవర్గంలో ఐదు గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి ఒక కోటి 25 లక్షల రూపాయలతో అంతర్గత సిసి రహదారి నిర్మాణ పనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీల ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ లో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒకటి. ఈ పథకం కింద లబ్దిదారులకు ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని దీపావళి నుండి ప్రారంభిస్తాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితంగా అందివ్వనున్నాం. ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. వచ్చే క్యాబినెట్ లో ఈ పథకానికి అనుమతి తీసుకుంటాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా గ్యాస్ సిలెండర్ల పంపిణీ ఉంటంది. కూటమీ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందన్నారు.

Check Also

రావి వెంక‌టేశ్వ‌ర‌రావు కి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ప్ర‌మాణ స్వీకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *