ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కరించేందుకే ప్రజా ఫిర్యాదుల వేదికని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. నగరపాలక సంస్థ సంబంధిత వివిధ సమస్యలను ప్రజలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు దరఖాస్తు చేసుకోగలరని కమిషనర్ కోరారు. ప్రతి సోమవారం లాగానే ఈ సోమవారం కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ తో సహా, జోనల్ కార్యాలయాల్లో కూడా నిర్వహిస్తున్నట్లు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు నగరపాలక సంబంధిత ఫిర్యాదులను జోనల్ లేదా ప్రధాన కార్యాలయంలో తమ ఫిర్యాదులు తెలుపవచ్చని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *