Breaking News

బి ఎన్ కే యూ 1వ ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్-2024 విజేతలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మూడు దేశాల నుండి 601 క్రీడాకారులు పాల్గొనగా ర్యాపిడ్ విభాగంలో ఐదు రోజులు పాటు స్విస్ లీగ్ పద్ధతిలో తొమ్మిది రౌండ్ల పోటీలు నిర్వహించారు. ర్యాపిడ్ విభాగంలో 3లక్షల నగదు బహుమతిని విజేతలకు బహుమతి ప్రధానం చేశామని టోర్నమెంట్ కన్వీనర్ ఎస్కే ఖాసీం గారు, బి ఎన్ కే యూ ఫౌండేషన్ సెక్రటరీ విత్తనాల్ కుమార్, కార్యదర్శి టి నరేష్, వైస్ ప్రెసిడెంట్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  శ్రీనివాసరాజు, చైర్మన్ ఎస్ఎల్వీ ఇన్ఫ్రా, ఎం వెంకటేశ్వరరావు, డిస్టిక్ గవర్నర్ క్లబ్, వై పార్థసారథిగారు , డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్, ఐకాన్ పబ్లిక్ స్కూల్, టోర్నమెంట్ కన్వీనర్ షేక్ ఖాసిం గారు, టోర్నమెంట్ డైరెక్టర్ విత్తనాల్ కుమార్ , ఆంధ్ర చెస్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్వాలాముఖి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ఎం ఫణి కుమార్, ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు పాల్గొని విజేతలకు ప్రధానం చేశారు.

ఓపెన్ విభాగం
ఛాంపియన్ : ఇంటర్నేషనల్ మాస్టర్ కౌత్సవ్ కుండు,
8/9 పాయింట్లు, పశ్చిమ బెంగాల్
₹50,000/- నగదు బహుమతి ట్రోఫీ

ద్వితీయ స్థానం : ఇంటర్నేషనల్ మాస్టర్ కుశాగ్ర మోహన్, 8/9 పాయింట్లు, తెలంగాణ
₹20,000/- మరియు ట్రోఫీ

తృతీయ స్థానం :
గ్రాండ్ మాస్టర్ వెంకటేష్ ఎంఆర్
8/9 పాయింట్లు
తమిళనాడు
₹10,000/- మరియు ట్రోఫీ

ఆరు రోజులుగా జరిగిన భారతీయ నవీన క్రీడా ఉత్సవ్ 1వ ఇంటర్నేషనల్ ఫిడే చెస్ ఫెస్టివల్ -2024 లో మొత్తం క్లాసికల్ , ర్యాపిడ్ మరియు బ్లిట్జ్ విభాగాల్లోనూ మొత్తం 15 లక్షల నగదు బహుమతిని ప్రధానం చేసామని ఈ సందర్భంగా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *