బాలల సంరక్షణ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

-జిల్లా పరిరక్షణాధికారి కె. భాస్కర రావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల సంరక్షణ కేంద్రాలు ఇతర ఏదైనా చట్టం కింద లైసెన్సు తీసుకున్నా, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టం 2015 లోని సెక్షన్ 41 కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా పరిరక్షణాధికారి కె. భాస్కర రావు బుధవారం ఒక ప్రకటనలో తెలియ చేసినారు. సవరించిన చట్టాలు, నిబంధనల మేరకు ‘రక్షణ సంరక్షణ అవసరమైన పిల్లల’ కోసం పూర్తిగా కానీ, లేదా పాక్షికంగా కానీ నడుపబడుతున్న బాలల సంరక్షణ కేంద్రాలు జువైనల్ జస్టిస్ చట్టం 2015 లోని సెక్షన్ 41 కి లోబడి తప్పనిసరిగా వారి సంస్ధ వివరాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ విషయం పై ప్రభుత్వం ఈ నెల 22న అధికారిక ప్రకటన జారి చేసిందని, సదరు వివరాలు , చెక్ లిస్టు అధికారిక వెబ్ సైట్ లో ఉంచడం జరిగిందన్నారు.

దరఖాస్తుతో పాటుగా అన్ని డాక్యూమెంట్ల కు సంబంధించిన కాపీలు జత చేసి నవంబర్ 11 లోగా సంచాలకులు, బాలల సంక్షేమం, సంస్కరణల సేవలు, వీధి బాలల సంక్షేమ శాఖ, విజయవాడ కార్యాలయానికి పంపాలన్నారు. పూర్తీ నోటిఫికేషన్, చిరునామా, అర్హతలు, జత పరచాల్సిన డాకుమెంట్లు, చెక్ లిస్టులు మొదలైన వాటిని http://wdcw ap.gov.in వెబ్ సైట్ లో ఉంచడం జరిగిందన్నారు. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమె సాఫ్ట్ కాపీస్ పంపాలన్నారు. వివరాలకు తూర్పు గోదావరి జిల్లా పరిరక్షణ అధికారి కె. భాస్కర రావు 9100045409 లేదా తూర్పు గోదావరి జిల్లా బాలల సంరక్షణ అధికారి సి. రాజ్ కుమార్ ను 96405 71098 ఫోన్ నెంబర్ లో సంప్రదించ వచ్చునని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *