నిత్యావసర సరుకులు సబ్సిడీ ధరల్లో వినియోగదారులకు సరఫరా చేయ్యాలి

-ధరల్లో వ్యత్యాసాలు బహిరంగంగా ప్రదర్శించాలి
-ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
-క్షేత్ర స్థాయిలో తనిఖీలు సందర్భంలో అక్రమ నిలువలు గుర్తించాలి
-కలక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్యవసర వస్తువులు, కూరగాయలు ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, హోల్ సేల్, రిటైల్ రంగంలో ధరలను విశ్లేషణ చెయ్యాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం కలక్టర్, జాయింట్ కలెక్టర్ సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, వినియోగదారులకి అందుబాటులో కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు ఉండేలా పర్యవేక్షణా తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉల్లిపాయలు , ఆయిల్ సబ్సిడీ ధరల్లో వినియోగదారులకి అందుబాటులో ఉంచుతున్నా, తగిన ప్రచారం కల్పించడం లో నిర్లక్ష్యం కారణంగా వినియోగదారులు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు తక్కువ రేటుకు ఆయిల్, ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి అని స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్ సమక్షంలో ప్రతిరోజూ ధరలు వ్యత్యాసాలు, ఎక్కడ లభ్యత అవుతుందో తెలుసుకుని, ఆమేరకు రైతు బజార్లలో, మార్కెటింగ్, పౌర సరఫరాల, స్వయం సహాయక సంఘాల మహిళలు అధ్వర్యంలో మరిన్ని ఔట్లెట్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రేపటి నుంచి రైతు బజార్లలో, ఇతర ఔట్ లెట్స్ వద్ద రేట్ చార్ట్ లు ఏర్పాటు చేయాలన్నారు. బియ్యం, ఆయిల్, ఉల్లిపాయలు, కందిపప్పు రోజు వారి అమ్మకాల వివరాలు ఎస్టేట్ ఆఫీసర్లు అందజేయాలన్నారు.

పామాయిల్ ఎమ్ ఆర్ పి రూ 116 ఉండగా రైతు బజార్లలో రూ.110 లకు, సన్ ఫ్లవర్ ఆయిల్ ఎమ్ ఆర్ పి రూ.165 ఉండగా రైతూ బజార్లో రూ.124 లకే లభ్యత్స్ అవుతోందని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. అదే విధంగా వినియోగ దారులకు ఫైన్ రకం బియ్యం కేజీ రూ.47/- చొప్పున, కందిపప్పు రూ .150 కే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు, ఇప్పటి వరకూ బియ్యం 3,380.50 క్వింటాలు 72786 మంది వినియోగగాధరులకు రూ.150/- చొప్పున కందిపప్పు 978.89 క్వింటాలు అమ్మకాలు జరిగాయన్నారు. అదే విధంగా ఆయిల్ కౌంటర్ వద్ద QR కోడ్ ద్వారా ధర ఒక్కంటికి రూ.110/- చొప్పున 263 మంది వినియోగగాధరులకు 696 పామ్ ఆయిల్ ప్యాకెట్ (850grms) మరియు సన్ ఫ్లవర్ ( పొద్దు తిరుగుడు పువ్వు) ధర ఒక్కంటికి రూ.124/- లు చొప్పున 213 ఆయిల్ ప్యాకెట్ (910 grms) వినియోగదాలకు విక్రయించినట్లు తెలిపారు. ఉల్లిపాయలు కర్నూలు రకం కేజీ రు.26 లకి, మహారాష్ట్ర ఉల్లి రూ.50 కి రైతు బజార్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఇతర కూరగాయల ధరలు విషయములో హేతుబద్ధత కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఖరీఫ్ సీజన్ సేకరణ పై సమీక్ష :
ధాన్యం సేకరణ వేగవంతం చెయ్యాలని, క్షేత్ర స్థాయిలో కోతలు చేపడుతున్న ఆర్ ఎస్ కె వారీగా వివరాలు సేకరించి, వాటిని ఎక్కడ విక్రయం చేస్తున్నారు, తదితర అంశాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. నల్లజర్ల, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు మండలం పరిధిలో ఖరీఫ్ సీజన్ కోతలు జరుగుతున్నట్లు, అదే సమయంలో పెరవలి లో కూడా కొతలు ప్రారంభం అయ్యాయని అధికారులు వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సగటున వెయ్య మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, క్షేత్ర స్థాయిలో కోతలు 3 వేల మెట్రిక్ టన్నుల ఉండగా మిగిలిన వాటికి చెందిన వివరాలు సేకరించాలని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా లభించేలా పర్యవేక్షణా చేయాలన్నారు. బ్యాంక్ గ్యారంటీ జమ చెయ్యని వాటికీ బ్లాక్ లిస్టులో పెట్టవలసిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటన సందర్భంలో అక్రమ నిలువల్ని గుర్తించే అవకాశం ఉందని కలెక్టరు తెలిపారు. క్షేత్ర స్థాయి పర్యటన లు మొక్కుబడిగా చేయ కూడదు అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్ చిన్న రాముడు, డీఎస్ఓ, కె వి ఎస్ ఎం. ప్రసాద్,  జిల్లా వ్యవసాయ అధికారి, ఎస్. మాధవరావు, లీగల్ మెట్రాలజీ ఏసి, కే. సా మ్యూల్ రాజు, ఎడి మార్కె టింగ్, ఎం. సునీల్ వినయ్, వాణిజ్య పన్నుల అధికారి, కె. రాజశేఖర్, ఆయిల్స్ ప్రెసిడెంట్ పి. సురేష్ కుమార్, పప్పు దినుసుల ప్రెసిడెంట్, పి. పెరు మాళ్ళు, ఉల్లిపాయలు ట్రేడింగ్ ప్రెసిడెంట్, మజ్జి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *