-ధాన్యం కొనుగోలు చేసే సమయంలో తూకం, తేమ శాతం, రికార్డుల నిర్వహణ డేటా ఎంట్రీ పరిశీలన
-కలెక్టర్ పి ప్రశాంతి
చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత 2024-25 ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతు సేవా కేంద్రాల సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం ఆకస్మికంగా చాగల్లు మండలం ఉనగట్ల, నెలటూరు రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి… అక్కడ రికార్డులు, డేటా ఎంట్రీ నమోదు, కోతలు కోసిన వివరాలు కోనుగోలు ప్రక్రియ పై వాకబు చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరణ కోసం జిల్లా వ్యాప్తంగా 220 రైతూ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో 9.2 శాతం కోతలు పూర్తి అయ్యాయన్నారు. నేలటూరు ఆర్ ఎస్ కె పరిథిలో 700 హెక్టార్ల విస్తీర్ణం సాగు చెయ్యగా, 120 హెక్టార్ల విస్తీర్ణంలో కోతలు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. అదే విధంగా ఉనగట్ల ఆర్ ఎస్ కె పరిథిలో 650 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చెయ్యగా 150 హెక్టార్ల విస్తీర్ణం కోతలు ఇప్పటి వరకు పూర్తి అయినట్లు తెలిపారు. కోతలు పూర్తి అయిన చాలా చోట్ల రైతులు కుప్పలు వేసి అరబెట్టడం జరిగిందనీ, వాటికీ సంబంధించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసినట్లు తెలిపారు. 2200 హెక్టార్ల విస్తీర్ణంలో ఫైన్ వెరైటీ, 6650 హెక్టార్ల విస్తీర్ణంలో నార్మల్ వేరైటీ కోతలు పూర్తి అయినట్లు తెలియా చేశారు. సుమారు 42 వేల మెట్రిక్ టన్నుల కోతలు పూర్తి కాగా, ఒపెన్ మార్కెట్ లో ఫైన్ రకం 2,100 మెట్రిక్ టన్నులు, రైతు సేవా కేంద్రాలలో 10,378 మెట్రో టన్నులు కొనుగోళ్లు చేపట్టడం జరిగిందన్నారు. కలెక్టరు వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, తహసిల్దార్ ఎమ్. మెరికమ్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News