అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసారు. సిసోడియా ఇటీవల గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న నేపధ్యంలో తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసారు. కరోనా నేపధ్యంలో రాజ్ భవన్ ను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఈ సందర్భంగా సిసోడియాకు ముఖ్యమంత్రి సూచించారు. గవర్నర్ ఆరోగ్య పరిరక్షణ విషయంలో నిరంతరం అప్రమత్తంగా …
Read More »Latest News
రాష్ట్రంలో 3కోట్ల 56లక్షల 29వేల మొబైల్ ఫోన్లతో ఆధార్ తో అనుసంధానం పూర్తి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3కోట్ల 56లక్షల 29వేల 373 మొబైల్ ఫోన్లతో ఆధార్ తో అనుసంధాన(Seeding)ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు.గురువారం ఆధార్ పెండింగ్ ప్రాజెక్టులపై అమరావతి సచివాలయంలో ఆయన యుఐడిఏఐ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2021 జనాభా(ప్రొజెక్టెడ్) అంచనాల ప్రకారం 5కోట్ల 28లక్షలు కాగా 5కోట్ల.40లక్షలు (102.3)శాతం ఆధార్ జనరేషన్ జరగ్గా,ఆధార్ జనరేషన్(లైవ్)5.11కోట్లు(96.9)శాతం పూర్తి కాగా ఇంకా 0.17కోట్లు చేయాల్సి ఉందని తెలిపారు.వయస్సుల …
Read More »వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన గవర్నర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. దివంతగ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. వైఎస్ఆర్ తన జీవితాన్ని ప్రజల సంక్షేమానికి అంకితం చేశారని ప్రస్తుతించారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, 104 ఆరోగ్య సేవల నుంచి ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తి పొందాయని గవర్నర్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ …
Read More »సచివాలయానికి వచ్చిన సర్వీసుకు నాణ్యమైన పరిష్కారం చూపించాలి…
-సచివాలయ ఉద్యోగులు విధులు నిబద్ధతతో చేయాలి -జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ -ఇబ్రహీంపట్నం -3 గ్రామ సచివాలయాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ విజయవాడ/ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయానికి వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని, విధుల నిర్వహణలో సచివాలయ ఉద్యోగుల జాగ్రత్తగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. గురువారం ఇబ్రహీంపట్నం -3 గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ మాట్లాడుతూ ఇంతకుముందు సమస్యల పరిష్కారం కోసం మండల తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు ప్రజలు …
Read More »వీరులపాడు మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్
-గురువారం వీరులపాడులో పి హెచ్ సి, సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ -ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీల సంఖ్య పెరగాలి విజయవాడ/వీరులపాడు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎక్కువ డెలివరీలు జరిగేలా చూడాలని తద్వారా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పై భారం తగ్గుతుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. గురువారం వీరులపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, సచివాలయాన్ని కలెక్టర్ జె.నివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అడుగడుగునా పరిశీలించి ఆసుపత్రిలో వివిధ వైద్య …
Read More »యుపిఎస్సీ పరీక్షలు నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు…
-అభ్యర్థులు పరీక్ష సమయానికి ముందుగానే హాజరు కావాలి… -నగరంలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు… -పరీక్షకు హాజరు కానున్న 1608 మంది అభ్యర్థులు… -కోవిడ్-19 మార్గదర్శకాలు అనుసరిస్తూ పరీక్ష ఏర్పాట్లు… -జిల్లా కలెక్టర్ జె.నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సెప్టెంబరు 5వ తేది ఆదివారం యుపిఎసి ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, అకౌంట్స్ ఆఫీసర్ల …
Read More »ఇబ్రహీంపట్నం లో ఘనంగా మహనేత వర్దంతి వేడుకలు…
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహనేత స్వర్గీయ డాక్టర్ వై యస్ రాజశేఖరరెడ్డి 12 వ వర్దంతి సందర్బంగా గురువారం ఇబ్రహీంపట్నం లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు స్థానిక నాయకులతో కలసి మహనేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రింగ్ సెంటర్ లో ఏర్పాటుచేసిన చిత్రపటానికి పూలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ మహనేత స్వర్గీయ రాజశేఖరరెడ్డి భౌతికంగా మన నుంచి దూరమై 12 …
Read More »ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రావుతో భేటి అయిన నగర పాలక సంస్థ కమిషనర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాంబేకాలనీ రెండు ఎకరాల స్థలంలో మినీ బస్ స్టేషన్ నిర్మాణం పై చర్చించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గురువారం ఆర్టీసీ భవన్‌లో సమావేశం అయ్యారు. సెంట్రల్ నియోజకవర్గం ప్రజలకు అవసరాల నిమిత్తం ఎమ్మెల్యే మల్లాది విష్ణు వినతి మేరకు వాంబే కాలనీలో మినీ బస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని గతంలో నగర పాలక సంస్థ కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగిన …
Read More »కోవిడ్ – 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ – 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ… కోవిడ్ పరిస్ధితులపై సీఎం సమీక్షా సమావేశం – కోవిడ్ పరిస్థితులను వివరించిన అధికారులు – థర్డ్‌వేవ్ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు – రాష్ట్రంలో 2.11 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు – మూడు జిల్లాలు మినహా మిగిలిన …
Read More »వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ ఘన నివాళి…
-ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, టీటీడీ చైర్మన్ …
Read More »