Breaking News

Monthly Archives: January 2025

ప్రజా సంబంధాల కార్యక్రమాల్లో ఉత్తమ సేవకులుగా టైపిస్ట్ కె.భవాని, రికార్డ్ అసిస్టెంట్ జి. శ్రీనివాసరావుకు గౌరవం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ నుంచి సమాచార, పౌర సంబంధాల శాఖకు చెందిన టైపిస్ట్ కె.భవాని, రికార్డ్ అసిస్టెంట్ జి. శ్రీనివాసరావు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా సమాచార శాఖ ద్వారా చేపట్టే ప్రజా సంబంధాల కార్యక్రమాల్లో ఉత్తమ సేవలకు గాను ఉద్యోగులకు ఈ గౌరవం లభించింది..

Read More »

విధుల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన ఆడియో విజువల్ సూపర్వైజర్ వేమూరి వెంకటేశ్వర ప్రసాద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ నుంచి సమాచార, పౌర సంబంధాల శాఖకు చెందిన ఆడియో విజువల్ సూపర్వైజర్ వేమూరి వెంకటేశ్వర ప్రసాద్ ప్రశంసా పత్రం అందుకున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా సమాచార శాఖ ద్వారా చేపట్టే ప్రజా సంబంధాల కార్యక్రమాల్లో ఉత్తమ సేవలకు గాను ఉద్యోగులకు ఈ గౌరవం లభించింది.

Read More »

జిల్లా కలక్టరేట్ ఆవరణలో 76 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కలక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ ఆవిష్కరించారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ , డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి షేక్. ఖాజావలి , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎ. లక్ష్మీ కుమారి, కలక్టరేట్ పరిపాలనాధికారి పూర్ణ చంద్ర రావు, కలక్టరేట్ ఉద్యోగులు, విద్యార్ధిని , విద్యార్డులు పాల్గొన్నారు.

Read More »

విధుల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన సమాచార పౌర సంబంధాల శాఖ…

  గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు అబ్దుల్ రఫీక్ , డివిజనల్ పౌర సంబంధాల అధికారి జే. శ్యామ్ కుమార్, టైపిస్ట్ సిహెచ్. శివరామక్రిష్ణ లకు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.

Read More »

పోలీసు కవాతు మైదానంలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ప్రజాప్రతినిధుల సూచనలు సహకారంతో , సమిష్టి కృషితో జిల్లా యంత్రాంగం సమర్ధవంతంగా అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టరు ఎస్ నాగలక్ష్మి తెలిపారు. ఆదివారం స్థానిక పోలీసు కవాతు మైదానంలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీస్ పెరేడ్ ను పరిశీలించారు. పోలీసు బలగాలు, ఎన్ సీ సీ, …

Read More »

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్యాస్ సిలెండర్ పేలిన ఘటనలో కాలిన గాయాలతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ముందుగా ఐసీయు లో చికిత్స పొందుతున్న వారిని , జనరల్ …

Read More »

హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి తొలగిస్తా…

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి జిల్లా సీకే పల్లి బీసీ హాస్టల్ లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి ఆదేశాలతో బీసీ సంక్షేమశాఖాధికారులు భోజనం సదుపాయం కల్పించారు. హెచ్ డబ్ల్యూవోపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం మంత్రి సవిత కలెక్టర్ తోనూ. బీసీ సంక్షేమ శాఖాధికారులతోనూ …

Read More »

ఉత్కంఠగా బాలబాలికల జాతీయ సెపక్ తక్రా పోటీలు

-సెమీఫైనల్ కి ప్రవేశించిన ఆంధ్రప్రదేశ్ బాలికల టీం బాలురు టీంకి షాక్ ఇచ్చిన ఢిల్లీజట్టు,క్వార్టర్ ఫైనల్ లో బాలుర ఆంధ్రప్రదేశ్ జట్టు నిష్క్రమణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్,ఎన్టీఆర్ స్కూల్ గేమ్స్ సంయుక్తంగా విజయవాడలోని పటమట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు)నందు ఈనెల 24నుండి ప్రారంభం అయిన U14 బాల,బాలికల సెపక్ తక్రా పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. బాలికల క్వార్టర్ ఫైనల్ లో మణిపూర్ …

Read More »

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిఎంసి శకటానికి ద్వితీయ స్థానం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన గుంటూరు జిల్లా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గుంటూరు నగరపాలక సంస్థ “స్వచ్చ ఆంధ్ర-స్వచ్చ దివస్” అంశం పై రూపొందించిన శకటం ద్వితీయ స్థానంలో నిలిచిందని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ తెలిపారు. ప్రశంశా పత్రాన్ని జిల్లా కలెక్టర్ యస్.నాగలక్ష్మి చేతుల మీదుగా కమీషనర్ మరియు ప్రజారోగ్యాదికారులు అందుకున్నారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3 వ శనివారం …

Read More »

సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..

-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, …

Read More »